NTV Telugu Site icon

‘అనుకోని అతిథి’ ట్రైలర్: పోటాపోటీగా నటించిన ఫహ‌ద్, సాయిప‌ల్ల‌వి

ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి జంటగా న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘అతిరన్‌’ ను తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో వస్తోంది. ఈ నేప‌థ్యంలో కొత్త ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. కాగా ఈ ట్రైలర్ అమాంతం ఉత్కంఠభరితంగా ఉంది. మానసిక సమస్యతో బాధపడే పాత్రలో సాయి పల్లవి నటన ఆకట్టుకుంటుంది. ఓ బంగ్లా నేప‌థ్యంలో వ‌చ్చే సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌విల నటన ఈ ట్రైలర్ లో హైలైట్ అని చెప్పుకోవచ్చు. వీరిద్దరూ నటనలో ఎవరికీ వారే సాటి అన్నట్లుగా నటించారు. మే 28 నుంచి ఆహా ఓటీటీ వేదికపై ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.