‘ఖిలాడీ’ రమేశ్ వర్మ చేతుల మీదుగా ‘మౌనం’ ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిషన్ సాగర్ సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ లో అల్లూరి సూర్యప్రసాద్, సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘మౌనం’. పారా సైకాలజీ నేపథ్యంలో రూపొందిన ఈ వినూత్న చిత్రానికి ‘వాయిస్ ఆఫ్ సైలెన్స్’ అన్నది ట్యాగ్ లైన్. ఎమ్. ఎమ్. శ్రీలేఖ సంగీతం ముఖ్య ఆకర్షణగా… ‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళి, బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఆవిష్కరించారు.
‘తన మిత్రుడు మురళి నటించిన ‘మౌనం’ చిత్రం మణిరత్నం ‘మౌనరాగం’ తరహాలో మంచి విజయం సాధించాల’ని రమేష్ వర్మ ఆకాంక్షించారు. నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్, సంధ్య రవి మాట్లాడుతూ, ‘మౌనం కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో, సెన్సిబిల్ గా చూపించే పారా సైకలాజికల్ థ్రిల్లర్ ‘మౌనం’ చిత్రమిదని అన్నారు. తమ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసిన రమేష్ వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఐశ్వర్య అడ్డాల, ‘శివ’ చిన్నా, జీవా, ధనరాజ్, శేషు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: అనిల్, స్క్రీన్ ప్లే-ఎడిటింగ్: శివ శర్వాణి.
Also Read

తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..