దసరా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’దే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ దసరాకు ఏకంగా మూడు సినిమాలు ఒకేసారి పోటీలో నిలిచాయి. దసరా సీజన్‌లో “పెళ్లి సందD”, “మహా సముద్రం”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రాలు మూడు సినిమాలు వచ్చాయి. అక్కినేని అఖిల్, సిద్ధార్థ్, శర్వానంద్, రోషన్… వీరందరికీ కూడా హిట్ ముఖ్యం. అయితే ముగ్గురు హీరోల సినిమాలూ ఒకేసారి విడుదలయ్యాయి. అందులో దసరాకు సందడి చేసిన సినిమా మాత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ బొమ్మ హిట్టు
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు 6 కోట్లకు పైగా షేర్ సాధించింది. వారాంతంలో ఈ చిత్రం కలెక్షన్లు స్థిరంగా ఉన్నాయి. అక్టోబర్ 14న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు 24 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా దసరా విజేతగా నిలిచి అఖిల్‌కి మంచి హిట్ ఇచ్చింది. దీనికి ముఖ్య కారణం సంగీతం, రొమాన్స్, పూజాహెగ్డే గ్లామర్ అని చెప్పొచ్చు. ‘లెహరాయి’ అంటూ సిద్ శ్రీరామ్ పాడిన పాటతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. అప్పుడే అందరి దృష్టిలో ఇది రొమాంటిక్ మూవీ అన్న ముద్ర పడిపోయింది. దీంతో యూత్ అంతా ఈ సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూశారు. దాని ఫలితమే సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రావడానికి కారణమైంది.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
Read Also : ఇంట్రెస్టింగ్ వీడియోతో విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్
కెరటంలా ఎగసి పడిన ‘మహా సముద్రం’
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “మహా సముద్రం”. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన ఈ ఇంటెన్సివ్ లవ్ స్టోరీ కూడా అక్టోబర్ 14నే థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదలకు ముందు నుంచే భారీ హైప్ ఉండడంతో మొదటి రోజు బాగానే కలెక్షన్లు వచ్చాయి. కానీ సినిమా విడుదలయ్యాక రెండవ రోజు నుంచి ఆక్యుపెన్సీ పడిపోయింది. వారాంతంలో కూడా కలెక్షన్లపరంగా పెద్దగా పుంజుకోలేదు. ఈ సినిమా శర్వా, సిద్ధార్థ్, దర్శకుడు అజయ్ భూపతికి బాక్సాఫీస్ నిరాశను మిగిల్చింది. నిజానికి ఈ సినిమా గురించి అజయ్ భూపతి చాలా కష్టపడ్డాడు. ఎంతోమంది హీరోలను కలిసి తిరస్కరణను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ నిరాశ పడకుండా ప్రయత్నించి అదే కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఫలితం మాత్రం ఆయన మొదటి సినిమాల లేదనే చెప్పాలి.
‘పెళ్లి సందD’ సందడి పర్లేదు !
ఈ చిత్రంతో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ శ్రీలీలకు ఇదే మొదటి చిత్రం. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు పాజిటివ్ బజ్ వచ్చింది. సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. యావరేజ్ గా నిలిచిన ఈ సినిమాకు పాటలు, మ్యూజిక్ సహాయం చేశాయని చెప్పొచ్చు. రెండవ రోజు నుండి ఆక్యుపెన్సీ పెరిగింది. వారాంతంలో మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గ్రాసర్‌గా కలెక్షన్లు రాబడుతోంది.
- Tags
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..