NTV Telugu Site icon

Ramoji Rao: బతికి ఉండగానే స్మారకం.. ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూద్దురు అనేవారు!

Ramoji Rao Mohanbabu

Ramoji Rao Mohanbabu

Mohan babu Crucial Comments on Ramoji Rao: అనారోగ్యంతో మరణించిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపు(ఆదివారం) రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య తెలంగాణ రాష్ట్ర అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ప్రస్తుతం ఫిల్మ్ సిటీ నివాసంలో ఉంచారు. అయితే…జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్న ఏకైక వ్యక్తి గా రామోజీరావు చరిత్రలో నిలిచిపోయారని అంటూ ఒక విడిపి వైరల్ అవుతోంది. చావు కంటే ముందే..స్మారకం నిర్మించుకుని ‘మరణం ఒక వరం’, ‘నాకు చావు భయం లేదు’ అని చెప్పి చూపించారని గతంలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో స్మారకం ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు.

Ramoji Rao: రామోజీరావు మృతి.. టాలీవుడ్ కీలక నిర్ణయం

దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రామోజీరావు గారుతో 43 ఏళ్ళ అనుబంధం నాది. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవారు, నేను కూడా పర్సనల్ గా వచ్చి కలిసి మాట్లాడేవాడిని. కలిసినప్పుడు ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. ఎలా ఉండాలి, సొసైటీలో ఎం జరుగుతోంది అని మాట్లాడుకునేవాళ్ళం. నేను ఎప్పుడు కలిసినా రెండు గంటల పాటు కదలనిచ్చేవారు కాదు. రండి, నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది… చూద్దురు అనేవారు! ఏమండి మిమ్మల్ని పలకరించడానికి వచ్చాను కానీ మీ సమాధిని నేనెందుకు చూడాలి అని నేను ఆనేవాడిని. అయితే మీరు ధైర్యస్తులు కదా ఎందుకు అంత పిరికితనంగా ఉంటారు అని పిలిచినా నేను ఎప్పుడూ వెళ్ళలేదు అని గుర్తు చేస్తుకున్నారు.