Site icon NTV Telugu

Ramoji Rao: రామోజీరావు కోసం ఆస్కార్ రావాలని కోరుకున్న ఎం.ఎం.కీరవాణి.. ఎందుకో తెలుసా?

Ramoji Rao Keeravani

Ramoji Rao Keeravani

Mm Keeravani Wanted Oscar for Ramoji Rao: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటు అంటూ పలువురు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రశంసల వర్షం కురిపించిన ఒక పాత వీడియో వైరల్ అవుతుంది. ఆస్కార్ అందుకున్న తరువాత ఆయన కోసమైనా తనకు ఆస్కార్ అవార్డు రావాలని కోరుకున్నానని కీరవాణి వెల్లడించారు. అప్పుడు అయన మాట్లడుతూ ఆస్కార్ అవార్డును అందుకునే విషయంలో తనకు ఏమీ ఎగ్జయిట్‌మెంట్ లేదని.. వస్తే చాలా మంచిదనే సదుద్దేశంతో ఉన్నానని తెలిపారు. ఎన్నో విపత్కర పరిస్థితులను జీవితంలో అనుభవించిన తనకు ఆస్కార్ అవార్డు అనేది పెద్ద ఎగ్జయిట్‌మెంట్‌ను ఇవ్వలేదని కూడా అప్పట్లో ఆయన అన్నారు.

Ramoji Rao: రామోజీరావు అస్తమయంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. లోకేష్‌ సహా టీడీపీ నేతల సంతాపం..

‘బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా బతకాలి మనిషన్నవాడు అని నా భార్య అంటుంటుంది, అటువంటి రామోజీరావు గారిని కలవడానికి వెళ్లినప్పుడు మీరు ఆస్కార్ తీసు కురండి ఇంటికి అని ఆయన అంటే నేను ఆశ్చర్యపోయా. రామోజీరావు గారు ఆస్కార్‌కు ఇంత విలువ ఇస్తున్నారా? అంటే దానికి కచ్చితంగా వాల్యూ ఉందన్నమాట.. అదెలాగైనా తీసుకురావాలి అని ఒక టెన్షన్ బయలుదేరింది. చంద్రబోస్ గారు చెప్పినట్లు ఆస్కార్ అవార్డు ప్రకటించడానికి 45 నిమిషాల ముందు.. ఎవరికోసం కాకపోయినా రామోజీరావు కోసం ఈ అవార్డు రావాలని కోరుకున్నాను, వచ్చింది.. వచ్చిన తరవాత ఇక మామూలే, ఒకసారి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తరవాత ఎటువంటి పరిస్థితుల్లో ఉంటామో అదే పరిస్థితిలో నేను ఉన్నా, 5 నిమిషాల ఎగ్జయిట్‌మెంట్ మెయింటైన్ అయ్యింది’ అని కీరవాణి చెప్పుకొచ్చారు.

Exit mobile version