Mirzapur The Movie: ఓటీటీలో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ ఇప్పుడు థియేటర్లలోనూ తన సత్తా చూపిస్తోంది. పంకజ్ త్రిపాఠి, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మీర్జాపూర్: ది మూవీ’కి మొదట్లో మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, ప్రస్తుతం ‘హనుమాన్ అన్ష్’ నుంచి పోటీ ఎదురవుతోంది. అయినా కూడా ఈ క్రైమ్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా 14వ రోజున కూడా కోట్ల రూపాయలు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల క్లబ్‌కు మరింత చేరువైంది. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మీర్జాపూర్: ది మూవీ’ 14వ రోజున బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ తగ్గటం లేదు. రెండు వారాలు పూర్తయినా సినిమాకు థియేటర్లలో వస్తున్న స్పందన కొనసాగుతుండటం ఇప్పుడు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ‘మీర్జాపూర్: ది మూవీ’ మంచి వసూళ్లు సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా మొత్తం కలెక్షన్ రూ.291.89 కోట్లకు చేరినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అంటే రూ.300 కోట్ల మార్క్‌ను అందుకోవడానికి ఇంకా సుమారు రూ.9 కోట్లు మాత్రమే అవసరం. 14వ రోజున ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.9 కోట్ల వసూళ్లు రావడం చూస్తే ఈ మైలురాయిని సినిమా త్వరలోనే చేరుకునే అవకాశం కనిపిస్తోంది. వీకెండ్ కావడంతో ఈ రెండు రోజుల్లో మరిన్ని వసూళ్లు సాధించి ఈ మూవీ 300 కోట్ల మార్కును అవలీలగా అధిగమించనుంది.
ఇక ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh) కూడా ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. బాక్సాఫీస్ నివేదికల ప్రకారం, కేవలం ₹2 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ భక్తిరస చిత్రం తన థియేట్రికల్ రన్‌లో 42 రోజులు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ₹309.15 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. అయితే ప్రపంచవ్యాప్త వసూళ్లలో ‘హనుమాన్ అంశ్’ కంటే ‘మీర్జాపూర్: ది మూవీ’ వెనుక ఉన్నప్పటికీ, ఓవర్సీస్ మార్కెట్ విషయంలో మాత్రం ఈ సినిమా ముందంజలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ మార్కెట్ల నుంచి ఇప్పటివరకు ‘మీర్జాపూర్: ది మూవీ’కి సుమారు రూ.49.75 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. మరోవైపు ‘హనుమాన్ అంశ్’ విదేశీ మార్కెట్‌లో దాదాపు రూ.22 కోట్లు రాబట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ‘మీర్జాపూర్: ది మూవీ’ ఇప్పటికే దేశీయంగా రూ.200 కోట్ల నెట్ మార్క్‌ను దాటింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మైలురాయికి చేరువ కావడంతో ఈ సినిమా తదుపరి రోజుల్లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. థియేటర్లలో కొత్త సినిమాల పోటీ ఉన్నప్పటికీ ‘మీర్జాపూర్’ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ సినిమాకు ఇంతగా బాక్సాఫీస్ వసూళ్లు రావడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

