Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’ రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్

Michel

Michel

ఇటీవలి కాలంలో బయోపిక్‌ల హవా గట్టిగా నడుస్తోంది. సెలబ్రిటీల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే ఈ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఒక హాలీవుడ్ బయోపిక్ మాత్రం ప్రపంచ బాక్సాఫీస్ చరిత్రలోనే సరికొత్త అధ్యయనాన్ని లిఖించింది. పాప్ సంగీత సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు ఏలిన లెజెండ్ మైకెల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన మైకెల్ సినిమా ఊహించని రేంజ్‌లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది.

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ ఆంటోన్ ఫుక్వా అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి స్పందనను దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా 1 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఒక్క ఉత్తర అమెరికాలోనే సుమారు 372 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. అంతర్జాతీయ మార్కెట్లో మరో 629 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా భారతీయ కరెన్సీలో ఏకంగా 9500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసి, ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన బయోపిక్‌గా చరిత్ర సృష్టించింది. ఈ ప్రభంజనంతో గతంలో అత్యధిక వసూళ్లు సాధించిన మ్యూజికల్ బయోపిక్ ‘బోహీమియన్ రాప్సోడి’ రికార్డులను మైకెల్ బద్దలు కొట్టింది. సుమారు 911 మిలియన్ డాలర్లు సాధించిన ఆ చిత్రాన్ని వెనక్కి నెట్టి సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. అంతేకాదు, గతంలో నిజ జీవిత ఆధారంగా రూపొంది సంచలన విజయం సాధించిన ‘ఓపెన్‌హైమర్’ రికార్డులను కూడా మైకెల్ అధిగమించడం విశేషం. జాన్ లోగన్ అందించిన కథతో రూపొందిన ఈ చిత్రంలో మైకెల్ జాక్సన్ పాత్రను ఆయన స్వయానా మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించారు. తొలి చిత్రంతోనే జాఫర్ అద్భుతమైన నటన కనబరిచారు. మైకెల్ జాక్సన్ హావభావాలు, ఐకానిక్ డ్యాన్స్ స్టైల్స్, స్టేజ్ ఎనర్జీని ఆయన పర్ఫెక్ట్‌గా రీ-క్రియేట్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. మైకెల్ జాక్సన్ బాల్యం నుంచి గ్లోబల్ పాప్ స్టార్‌గా ఎదిగిన ప్రయాణాన్ని ఎంతో ఎమోషనల్‌గా చూపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.