Megastar Chiranjeevi Kind Gesture: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఈరోజు తనకంటూ సుస్థిరమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆపద అని వస్తే నేనున్నా అని అభయం ఇచ్చే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే మెగాస్టార్ గొప్పతనం గురించి అనేక విషయాలు ఎప్పుడూ బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఆయన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడ లేదు కానీ అందుకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ అయితే పూర్తయిపోయింది. జూలైలో సినిమా షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
Koratala Siva : ‘దేవరా’ నీవే దిక్కయ్యా!
నిజానికి ఇది మలయాళంలో తెరకెక్కి సూపర్ హిట్గా నిలిచిన బ్రో డాడీ అనే సినిమా రీమేక్ అనే ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి ఈ సినిమాకి బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించినట్లు తెలుస్తోంది. అయితే బ్రో డాడీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తెలుగుదనానికి తగినట్టుగా మార్పులు చేర్పులు చేశారా? లేక ఇది పూర్తిగా కొత్త కథనా అనే విషయం సినిమా రిలీజ్ అయితే కానీ క్లారిటీ రాదు. అయితే ఈ లోపే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకోగా అది ఫిలింనగర్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అయింది. కళ్యాణ్ కృష్ణతో చేయబోతున్న సినిమాకి ప్రసన్నకుమార్ కథ అందించగా ఆ కథ లైన్లోనే మరో సినిమా కూడా టాలీవుడ్ లో తెరకెక్కించే ప్రయత్నాలు జరిగాయట. వెంటనే ఆ రైటర్ ని కూడా పిలిపించి భారీగా పారితోషికం అందించి .. ఆ కథని వదిలేయాలని, తనకు అలాంటి కథే నచ్చడంతో దాన్ని వదిలేయాలని కోరారట మెగాస్టార్ చిరంజీవి. దీంతో ఆ రైటర్ ఫుల్ ఖుషీ అయ్యాడని చెబుతున్నారు.
Adipurush Theaters Count: ప్రపంచవ్యాప్తంగా 7000 థియేటర్లలో ఆదిపురుష్..ఎక్కడెక్క ఎన్నంటే?
నిజానికి ఇలాంటి వ్యవహారాలలో హీరో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏం జరిగినా ఒక రచయిత మరో రచయితతో మాట్లాడుకునే సెట్ చేసుకోవాలి, కానీ మెగాస్టార్ చిరంజీవి తనకు కథ నచ్చడంతో ప్రసన్న కుమార్ కు ఇబ్బంది కలగకుండా అలాగే ఔత్సాహిక రైటర్ కి కూడా ఇబ్బంది కలగకుండా ఇద్దరికీ పేమెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఊరికే రూపాయి కూడా బయట పెట్టని సినీ పరిశ్రమలో టాలెంట్ ఉన్న ఒక రైటర్కు అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో మెగాస్టార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయన మీద ప్రశంసల వర్షం కురిసేలా చేస్తోంది. టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సిద్దు జొన్నలగడ్డ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ భార్య పాత్రలో త్రిష నటిస్తుండగా సిద్దు జొన్నలగడ్డ ప్రేమికురాలు పాత్రలో శ్రీ లీల ఎంపికైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ కాంబినేషన్ల విషయంలో మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం లేదు.