NTV Telugu Site icon

Chiranjeevi: బిగ్ బ్రేకింగ్.. గోవా గడ్డపై తెలుగోడు గర్వించేలా మాట్లాడిన చిరు

Chiru

Chiru

Chiranjeevi: గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చిరంజీవి సందడి చేశారు. చిరు ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును అందుకున్నారు. గోవా వేదికపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా చిరు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ “నాకు ఈ అవార్డును అందజేసిన మంత్రులకు ధన్యవాదాలు. ఈ అద్భుతమైన అవార్డును ఇచ్చినందుకు ఇఫీకు, ప్రభుత్వానికి థాంక్స్ చెప్తున్నాను. నేను మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టాను.. నా తల్లిదండ్రులు ఎంతో ప్రేమకలిగినవారు. ఇండస్ట్రీకి ముందు నేను.. కొణిదెల శివశంకర వరప్రసాద్. కానీ, ఇప్పుడు నా పేరు, నా కరిష్మా, నా ఫేమ్ అన్ని నా అభిమానులు ఇండస్ట్రీకి వచ్చాకా ఇచ్చినవే.

నేను ఎప్పుడు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. శివ శంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా జన్మనిచ్చిన అభిమానులకు, ఫిల్మ్ ఇండస్ట్రీకి రుణపడి ఉంటాను. ఇన్ని ఏళ్లలో నేనెప్పుడూ ఈ వేడుకను మిస్ అవ్వలేదు.. ఒక సంవత్సరం మాత్రమే మిస్ అయ్యాను.. రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు. దాన్ని నుంచి బయటికి వచ్చాకా కూడా అభిమానులు నాకు అంతే ప్రేమను చూపించారు. ప్రామిస్ చేస్తున్నాను.. నేను ఎప్పటికి సినిమాలు వదలను. నేనెప్పుడూ మీతోనే జీవితాంతం మీతోనే ఉంటాను. ప్రపంచంలో ఎంతమంది అభిమానులు ఉన్నారో వారందరి ప్రేమ నాకు కావాలి. వారి కోసం నేనెప్పుడూ ఉంటాను” తెలిపారు.