NTV Telugu Site icon

Nani 30: ‘మెగా’ గ్రాండ్ గా లాంచ్ అయిన నాని నెక్స్ట్ మూవీ…

Chiru Nani

Chiru Nani

దసరా టీజర్ తో పాన్ ఇండియా రేంజులో హీట్ పెంచిన నాని, తన 30వ సినిమాని మొదలు పెట్టాడు. కూల్ బ్రీజ్ లాంటి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకి రానున్న నాని, 30వ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా పూర్తి చేసుకుంది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. విజయేంద్ర ప్రసాద్, బుచ్చిబాబు సన, డీవీవీ దానయ్య, కిషోర్ కుమార్ తిరుమల లాంటి నాని కొల్జ్ సర్కిల్ గెస్టులుగా వచ్చి ‘నాని 30’ లాంచ్ ఈవెంట్ కి మరింత స్పెషల్ చేశారు. మృణాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లాంచ్ కి ఆమె వస్తుందని చాలా మంది వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ లాంచ్ ఈవెంట్ కి మృణాల్ రావడంతోనే కెమెరాలు క్లిక్ మన్నాయి. దీంతో సోషల్ మీడియాలో ‘సీత’ అంటూ మృణాల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read Also: Nani: వెన్నెల కనిపించేది ఆరోజే…

‘నాని 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోలో నాని, ఒక పాపతో కూర్చోని ‘నాని 30’ గురించిన డీటైల్స్ ని చాలా ఇంటరెస్టింగ్ గా చెప్పాడు. గడ్డంతో ఉండను, మీసాలు ఉంచను, జుట్టు మాత్రమే ఉంచుతాను అని తన లుక్ గురించి హింట్ ఇచ్చిన నాని… చెప్పినట్లుగానే కర్లీ హెయిర్ తో, గడ్డం లేకుండా లవర్ బాయ్ లా కనిపించాడు. ఈ సినిమాని ‘శౌర్యువ్’ డైరెక్ట్ చేస్తున్నాడు. నాని కూతురి పాత్రలో ‘బాబే కియారా ఖన్నా’ నటిస్తుండగా, కన్నడ హిట్ సినిమా ‘హ్రిదయం’కి మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘హీషం అబ్దుల్ వాహబ్’ ‘నాని 30’కి సంగీతం అందిస్తున్నాడు.  నాని నటించిన శ్యాం సింగ రాయ్ సినిమాకి బ్యుటిఫుల్ విజువల్స్ ఇచ్చిన ‘సను వర్గీస్’ ‘నాని30’కి కూడా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీని ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ ప్రొడ్యూస్ చేస్తోంది.

Nani 30

Show comments