NTV Telugu Site icon

Megastar: ఆరోజు వెయ్యి మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు.. చిరంజీవి కీలక ప్రకటన

Chiranjeevi Free Cancer Scr

Chiranjeevi Free Cancer Scr

Megastar Chiranjeevi about Free Cancer Screening Camp: కొన్ని రోజులు క్రిందట ఒక క్యాన్స‌ర్ స్క్రీనింగ్ సెంట‌ర్ ని ప్రారభించగా అక్కడ తనను ఇంతటి వాడిని చేసిన ప్రేక్షకుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఒక రిక్వెస్ట్ చేశారు. క్యాన్సర్ పై అవగాహన లేక చాలామంది ప్రమాదం బారిన పడుతున్నారని, దానిని ముందుగా గుర్తించాలన్నా ఏ టెస్టులు చేయించుకోవాలో తెలియని వారు చాలామంది ఉన్నారని ఆయన గ్రహించారు. వారందరి కోసం తమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పరీక్షల నిర్వహిస్తామని, వాటికి అయ్యే ఖర్చులు తానూ భరిస్తాను అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ క్యాన్సర్ టెస్ట్ క్యాంప్ సెంటర్స్ గురించి మెగాస్టార్ చిరంజీవి, డాక్టర్ గోపీచంద్ సంయుక్తంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం మూడు వారాల గతం నానక్ రామ్ గూడ స్టార్ హాస్పిటల్ లో క్యాన్సర్ టెస్టులకు సంబంధించి ఒక విభాగాన్ని నేను ప్రారంభించడం జరిగింది. ఆ రోజు డాక్టర్ గారితో నేను సంభాషించినప్పుడు వారిని నేను అడగడం జరిగింది. ఈ క్యాన్సర్ కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టుల్లో మా అభిమానులకు, అలాగే సినీ కార్మికులకు లబ్ది చేకూరే లాగా మనం ఏమైనా చేయగలమా? నాకు ఏదైనా చేయాలనిపిస్తుంది, మీరు ఏ విధంగా సహకరించగలరు? దానికి ఖర్చు ఏమవుతుంది? ఆ ఖర్చు నేను భరించడానికి రెడీగా ఉన్నాను, మీ సహకారం కావాలి డాక్టర్ అని అడిగినప్పుడు ఆయన అక్కడికక్కడే మాట ఇచ్చారు.
TTD: అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి.. కీలక చర్యలు చేపట్టిన టీటీడీ
అయితే మాట ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి సమయం పడుతుంది కదా అని నేను అనుకున్నాను కానీ రెండు వారాల సమయంలో ఆయన దీన్ని కార్యరూపం దాల్చేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసి రెండు రోజుల క్రితం కవర్ అందించినప్పుడు చాలా చాలా సంతోషించాను. ఎందుకంటే పబ్లిక్ లో మాట ఇచ్చారు తప్పరు కానీ కొంచెం సమయం తీసుకుంటారు అనుకున్నాను కానీ ఆయన ఇచ్చిన మాట ప్రకారం చాలా తక్కువ సమయంలో దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. జూలై 9వ తేదీన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో సినీ కార్మికులు తన అభిమానులు సినీ జర్నలిస్టులు మొత్తం వెయ్యి మందికి మొదటి రోజు టెస్టులు చేయడానికి సంసిద్ధమయ్యామని చెప్పుకొచ్చారు. ఆరోజు ఓరల్ క్యాన్సర్ కి సంబంధించిన ముందస్తు టెస్టులు చేయడం జరుగుతుంది, దానిని వినియోగించుకోవాలని అందరిని కోరుతున్నాను అని అన్నారు. దాదాపు 40 శాతం మంది ఈ ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు, పొగాకు నమలడం వల్ల పాన్ పరాగ్ వంటివి నమలడం వల్ల ఇతర కారణాలవల్ల ఈ నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎక్కువమంది ఈ నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు కాబట్టి దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి స్క్రీనింగ్ టెస్టులు చేసి ముందే దాన్ని పసిగడితే కొంత నివారించే అవకాశం ఉంటుందని డాక్టర్లు సూచించారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
Sunil Deodhar: కేరళ స్టోరీ సినిమా అందరూ చూడాలి.. అదిప్పుడు ఏపీలో జరుగుతోంది!
అలాగే ముందు గుర్తించే క్యాన్సర్లు ఏమేమి ఉన్నాయి అని అడిగినప్పుడు మహిళలకు సంబంధించి బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే సర్వైకల్ క్యాన్సర్ వంటి వాటిని ముందే గుర్తించవచ్చని డాక్టర్లు చెప్పారని అన్నారు. అవి మాత్రమే కాకుండా దాదాపు 7, 8 రకాల క్యాన్సర్లను ముందే గుర్తించే విధంగా స్క్రీన్ టెస్ట్ లు చేస్తాం, లంగ్స్, పెద్ద పేగుకి సంబంధించినవి, పొట్టకు సంబంధించిన టెస్టులు చేస్తామని అన్నారు. ఇలా ఒక్కొక్క రకమైన క్యాన్సర్ టెస్టు ఒక్కోసారి జరుపుతారని, ఆ వివరాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తామని మెగాస్టార్ అన్నారు. ఈ టెస్టులు చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ అవకాశం ఉంటే ఎప్పటిలోగా రావచ్చు? ఒకవేళ వస్తే ఏ స్టేజ్ లో ఉంది? లాంటి వివరాలు అన్ని తెలుస్తాయని అన్నారు. దానిని బట్టి తర్వాత ఏం చేయాలి అనే విషయం ఆలోచిస్తారని అన్నారు. ఈ టెస్టులను సద్వినియోగం చేసుకోవాలని మరోసారి విన్నవించుకుంటున్నాను అని మెగాస్టార్ కోరారు. జూలై 9న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో క్యాన్సర్ టెస్టులు చేస్తారు, రెండు మూడు రోజుల్లో సినీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై ఈ విషయాన్ని చర్చిస్తాం. ఈ క్యాన్సర్ స్క్రినింగ్ కోసం ప్రత్యేక కార్డులు జారీ చేస్తామని పేర్కొన్న చిరంజీవి జులై 9న హైదరాబాద్, 16న వైజాగ్, 23న కరీంనగర్ లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తాం” అని తెలియజేశారు.

Show comments