Site icon NTV Telugu

Megastar Chiranjeeevi: పేరు మార్చుకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే..?

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవి పేరు మార్చుకున్నారా..? అంటే నిజమే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇటీవల గాడ్ ఫాదర్ టైటిల్ పోస్టర్ లో కూడా చిరు కొత్త పేరుతో దర్శనమిచ్చాడు. సాధారణంగా సినిమా వాళ్లు ఎక్కువగా న్యూమరాలజీని నమ్ముతారన్న విషయం విదితమే.. తమకు మంచి హిట్లు రావాలని, తమ జీవితంలో కొత్త కొత్త విజయాలను అందుకోవడానికి తమ పేరులో కొన్ని అక్షరాలను యాడ్ చేసాయడం, ఇంకొన్ని అక్షరాలు తొలగించుకోవడం చేస్తూ ఉంటారు. ఇటీవల మెగా మేనల్లుడు న్యూమరాలజీ ప్రకారం సాయి ధరమ్ తేజ్ తేజ్ విషయం విదితమే. ఇక తాజాగా చిరంజీవి పేరును మార్చుకున్నాడు అంటూ వార్తలు గుప్పమంటున్నాయి. నిన్న రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందులో చిరు ఇంగ్లీష్ పేరులో కొత్తగా మూడో ‘ఈ’ ను యాడ్ చేశారు.

‘Megastar Chiranjeevi’ అని ఉండాల్సిన పేరులో ఇంకో E యాడ్ చేసి ‘Megastar Chiranjeeevi’ అనిచూపించారు . దీంతో చిరు న్యూమరాలజీ ద్వారా పేరు మార్చుకున్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇక దీనికి కారణం కూడా ఆచార్య ప్లాప్ కావడమని, ఈ సినిమా దవారా చిరు దాదాపు రూ. 70 కోట్లు నష్టపోయాడు. దీనివలన చిరు న్యూమరాలజిస్ట్ ను కలిసి పేరు మార్చుకున్నాడని చెప్పుకోస్తున్నారు. ఇక ఈ వార్తలను చిరంజీవి సన్నహితులు, గాడ్ ఫాదర్ చిత్ర బృందం ఖండిస్తున్నారు. గాడ్ ఫాదర్ యూనిట్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు జరిగిన మిస్టేక్ మాత్రమే అని, చిరు ఎలాంటి న్యూమరాలజిస్ట్ సలహా తీసుకోలేదని చెప్పుకొస్తున్నారు. ఎడిటింగ్ తప్పిదం వలన ఇంకో ‘E’ యాడ్ అయ్యిందని, మరోసారి అలంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చిత్రబృందం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ వార్తపై చిరు క్లారిటీ ఇస్తే బావుంటుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి చిరు ఈ వార్తపై స్పందిస్తారేమో చూడాలి.

Exit mobile version