అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా నేడు మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేసారు మేకర్స్. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో భారీ ఈవెంట్ నిర్వహించి అభిమానుల సమక్షంలో గ్లిమ్స్ రిలీజ్ చేసారు. విక్టరి వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకర వరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు’ ట్యాగ్ లైన్ తో టైటిల్ ను రిలీజ్ చేసారు. గ్లిమ్స్ లో చిరు లుక్స్ చూస్తుంటే వింటేజ్ చిరు మరోసారి ఎంటర్టైన్ చేయబోతున్నాడని పిస్తోంది. మాస్ మ్యూజిక్ స్పెషలిస్ట్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా కానుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న చిరు – అనిల్ ఈ సారి సంక్రాంతికి నవ్వులు పూయించడం ఖాయం.
