Site icon NTV Telugu

Raviteja: మాస్ కాంబినేషన్ ఆ ‘మరణహోమం’ కథతో సినిమా చేస్తుందా?

Raviteja

Raviteja

డాన్ శ్రీను, బలుపు, క్రాక్… చేసిన మూడు సినిమాలతో ఒకదాన్ని మించి ఇంకో హిట్ ఇచ్చారు మాస్ మహారాజ రవితేజ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ ఇద్దరూ కలిస్తే సినిమా హిట్ అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. రవితేజని ఎలా చూపిస్తే ఆడియన్స్ కి నచ్చుతుందో గోపీచంద్ మలినేనికి తెలిసినంతగా మరో దర్శకుడికి తెలియదు. రవితేజకి పర్ఫెక్ట్ గా వాడడంలో దిట్ట గోపీచంద్ మలినేని. అలాగే రవితేజ లేని గోపీచంద్ మలినేని కెరీర్ ని ఊహించడం కష్టమే. రియల్ లైఫ్ లో కూడా బ్రదర్స్ లా ఉండే రవితేజ, గోపీచంద్ మలినేని కలిసి ‘క్రాక్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇదే మాస్ హిస్టీరియాని మరోసారి క్రియేట్ చేయడానికి రవితేజ-గోపీచంద్ మలినేని రెడీ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం గత కొంతకాలంగా మాస్ మహారాజ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డు వేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. “THE MASSIEST COMBO IS BACK TO CREATE MAGIC AT THE BOX OFFICE” అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసారు. #RT4GM అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. థమన్-రవితేజ… థమన్-గోపీచంద్ మలినేని… థమన్-గోపీచంద్ మలినేని-రవితేజలది సూపర్ హిట్ కాంబినేషన్… అదే మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేయడానికి ఈ కాంబో రెడీ అయ్యింది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇందులో విలేజ్ బ్యాక్ డ్రాప్, టెంపుల్ సెటప్, ఉరి వేయబడిన మనిషి ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ లో ఊరి పేరు కూడా ఉంది. ‘చుండూరు’ అనే నేమ్ బోర్డు పోస్టర్ లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశాన్ని కుదిపేసింది చుండూరు మారణహోమం. 1991 ఆగస్టు 6న 22 దళితుల మరణానికి కారణమైన ఈ మారణహోమం కథతో రవితేజ-గోపీచంద్ మలినేని సినిమా చేస్తున్నారా లేక ఆ ఊరి పేరు మాత్రమే తీసుకున్నారా అనేది చూడాలి. క్రాక్ మూవీని కూడా ఒంగోలు రౌడీ షీటర్ కటారి కృష్ణ జీవితాన్ని ఆధారంగా తీసుకొని గోపీచంద్ మలినేని, కథని అల్లుకున్నాడు. చూడూరు విషయంలో అలా చేయడం సినిమాకే కాదు ఆ సినిమా చేసే వాళ్లకి కూడా ఇబ్బంది కలిగించే విషయమే. మరి చుండూరు పేరు మాత్రమేనా లేక సినిమా ఆ మారణహోమం చుట్టూనే తిరుగుతుందా అనేది చూడాలి.

 

Exit mobile version