Site icon NTV Telugu

Director Mukkhesh : ప్రూవ్ చేసుకోవాలి, ఆ తర్వాతే స్టార్స్ అవకాశాలు ఇస్తారు!

Market Mahalaxmi Movie Director Interview

Market Mahalaxmi Movie Director Interview

Market Mahalakshmi Director VS Mukkhesh Interview: బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం హీరోగా ప్రణీకాన్వికా హీరోయిన్ గా నటిస్తున్న ‘మార్కెట్ మహాలక్ష్మి’ ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ కానుంది. . డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించగా సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ సినిమా దర్శకుడు వియస్ ముఖేష్ మీడియాతో ముచ్చటించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. యూట్యూబ్ ప్లాట్ ఫామ్ ‌లో దాదాపు 100+ షార్ట్ ఫిలిమ్స్ చేసి ఒకరోజు అఖిలేష్‌ ని కలిసి “మార్కెట్ మహాలక్ష్మి” స్క్రిప్ట్‌ నరేట్ చేశా ఆయనకి నచ్చి సినిమా మొదలు పెట్టాము. చాలా మంది తమ సినిమాల్లో కొత్త పాయింట్ ని టచ్ చేశామని చెప్తుంటారు అయితే మేము ఇప్పటి వరకు ఆడియన్స్ కి తెలియని ఒక కొత్త పాయింట్‌ను టచ్ చేశామన్నారు.

ఆ మేజర్ పాయింట్ ని ప్రమోషన్ల కోసం ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే టీజర్, ట్రైలర్‌లో చూపించలేదు. ఆ కొత్త పాయింట్ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. పార్వతీశం & కొత్త నటిని ఎంచుకోవడానికి కారణం వాళ్ళు ఈ పాత్రలకి సరైన న్యాయం చేయగలరని నమ్మకమే, ఒక కొత్త దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఆ తర్వాతే స్టార్స్ అవకాశాలు ఇస్తారు. “మార్కెట్ మహాలక్ష్మి” పూర్తి లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిజ జీవితంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు, అది బేస్ చేసుకొని సినిమా కథ గా రాయడం జరిగింది. రియల్ లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది అన్నారు. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. చాలా రిస్క్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది, నా నమ్మకం నటీనటులపై కాదు, నా స్క్రిప్ట్‌పై, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నేను నమ్ముతున్నానని అన్నారు.

Exit mobile version