Site icon NTV Telugu

Manchu Manoj : అది నా తండ్రి ఇచ్చిన ఆస్తి.. మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Manoj

Manoj

Manchu Manoj : మనోజ్ చాలా ఏళ్ల తర్వాత భైరవం సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఏడేళ్ల తర్వాత ఆయన నుంచి సినిమా వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ కలిసి నటించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో ముగ్గురి పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు వస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో మనోజ్ కు ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఈ మూవీలో మీ వాయిస్ మీ నాన్నను పోలినట్టే అనిపించింది. కావాలనే చేశారా అంట ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.

Read Also : Rajendra Prasad : మళ్లీ నోరు జారిన నటుడు రాజేంద్ర ప్రసాద్.. అలీని తిట్టేశాడు..

దానికి మనోజ్ స్పందిస్తూ.. అది మా నాన్న నుంచి నాకు వచ్చిన ఆస్తి. ఈ సినిమాలో నా పాత్రకు మంచి బేస్ ఉంది. పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉంది. నా పాత్రను డైరెక్టర్ విజయ్ అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ మూవీ తర్వాత నాకు మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను అంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా విడుదలైన రోజు ఉదయమే మనోజ్ ఓ పోస్టర్ వేశాడు. తన తండ్రి మోహన్ బాబు పెద రాయుడు లుక్ పక్కనే తన భైరవం లుక్ ను పెట్టుకుని ఓ ఎడిట్ చేసిన ఫొటోను పోస్ట్ చేశాడు. ‘ఆయన కొడుకు వచ్చాడని చెప్పు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అంటే తన తండ్రిని పోలినట్టు తన పాత్ర ఉంటుందని చెప్పకనే చెప్పాడు.

Read Also : Ali : కమెడియన్ అలీకి చిరంజీవి స్పెషల్ గిఫ్ట్..

Exit mobile version