NTV Telugu Site icon

Mani Sharma: కృష్ణంరాజు మరణం మరువకముందే మణిశర్మ ఇంట మరో విషాదం

Manisharma

Manisharma

Mani Sharma: చిత్ర పరిశ్రమలో నేడు విషాదాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు నేటి ఉదయం మృతి చెందిన విషయం విదితమే. ఒక లెజెండ్ ను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషాదాన్ని ఇంకా మరువకముందే సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. మణిశర్మ తల్లి మనమండ్ర సరస్వతి కొద్దిసేపటి క్రితం మరణించారు. గత కొన్నిరోజులుగా వయో వృద్ధ సమస్యలతో బాధపడుతున్న ఆమె నేడు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు.

ఇక నాలుగేళ్ళ క్రితం మణిశర్మ తండ్రి వైఎన్ శర్మ కన్నుమూయగా.. నేడు ఆయన తల్లి తుదిశ్వాస విడిచారు. దీంతో మణిశర్మ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. మణిశర్మకు చిన్నప్పుడే సంగీతం అంటే మక్కువ ఎక్కువ అని సరస్వతి గ్రహించి వైఎన్ శర్మ ను ఒప్పించి మణిశర్మను సంగీత పాఠాలకు పంపించేవారట. తల్లి వలనే తాను ఇక్కడి వరకు వచ్చానని మణిశర్మ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలియడంతో పలువురు ప్రముఖులు ఆమె తల్లికి సంతాపం తెలియజేయడంతో పాటు మణిశర్మ కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇలా ఒకే చిత్ర పరిశ్రమలో ఉన్నవారి కుటుంబాల్లో విషాదాలు జరగడం తీవర ఆవేదనకు గురిచేస్తున్నాయి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు తెలుపుతున్నారు.

Show comments