Site icon NTV Telugu

‘మణిశంకర్’గా శివ కంఠమనేని! మోష‌న్ పోస్ట‌ర్‌ విడుదల!!

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న సినిమా ‘మణిశంకర్’. యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఓ డిఫ‌రెంట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి. వెంకట కృష్ణన్ (జి.వి. కె). కె.ఎస్. శంకర్రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ‘మణిశంకర్’ టైటిల్ అండ్ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ముందు క‌త్తుల‌తో ఇంటెన్స్‌లుక్‌లో శివ కంఠ‌మ‌నేని ఉన్న ఈ మోష‌న్ పోస్ట‌ర్‌కి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తుందని నిర్మాతల్లో ఒకరైన కె.ఎస్. శంకర్రావు తెలిపారు. ఈ సంద‌ర్భంగా హీరో శివ‌కంఠ‌మ‌నేని మాట్లాడుతూ, ”సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దేల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ద‌ర్శ‌కుడు జీవీకే మేకింగ్ చాలా కొత్త‌గా ఉంది. ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

Exit mobile version