Site icon NTV Telugu

Jithender Reddy : లచ్చిమక్క అంటున్న మంగ్లీ.. మరో మాసీ నెంబర్ తో వచ్చేసింది!

Mangli Song

Mangli Song

Mangli’s Latest Song “Lachhimakka” from Jithender Reddy Released: ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేశాయి.

Priyadarshi: మరో హీరోయిన్‌ను డార్లింగన్న ప్రియదర్శి.. నీ మైండ్‌కేమైందంటూ ఆడుకున్న నభా!

రీసెంట్ గానే విడుదల అయిన అ ఆ ఇ ఈ ఉ ఊ సాంగ్ మంచి ప్రేక్షక ఆదరణ పొందగా ఇప్పుడు విడుదలైన ‘లచ్చిమక్క’ సాంగ్ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ఉంది. ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు, ఇక హ్యాపెనింగ్ సింగర్ మంగ్లీ ఈ పాటని చాలా బాగా పాడారు. జితేందర్ రెడ్డి ఇంట్లో జరిగే పెళ్ళిలో సరదాగా సాగే ఒక పాటలా ఉంది. 1980′ లో లొకేషన్స్ అన్ని కూడా చాలా నాచురల్ గా అనిపిస్తున్నాయి. ఈ పాట వింటుంటే కథలో అనేక ట్విస్టులు ఉన్నట్టు అర్ధమవుతుంది. ప్రస్తుతం వస్తున్న కథలకి పూర్తి భిన్నంగా ఈ జితేందర్ రెడ్డి ఉంటుందని చెబుతున్న మేకర్స్ ఈ సినిమాను మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

Exit mobile version