NTV Telugu Site icon

Manchu Vishnu: 48 గంటల్లో ‘కన్నప్ప’ వస్తున్నాడు…

Manchu Vishnu Vs Prabhas

Manchu Vishnu Vs Prabhas

డైనమిక్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’ని భారీ బడ్జట్ తో ప్రొడ్యూస్ చేస్తూ హీరోగా నటిస్తున్నాడు. దాదాపు వంద కోట్ల బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీపై మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. న్యూజిల్యాండ్ లో భక్త కన్నప్ప రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ షూటింగ్ లో ఇటీవలే మంచు విష్ణుకి గాయాలు కూడా అయ్యాయి. షూటింగ్ ని మాత్రం ఆపకుండా ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. మొత్తం కాస్ట్ అండ్ క్రూ న్యూజిల్యాండ్ లోనే ఉండి భారీ సెటప్ తో భక్త కన్నప్ప సినిమా చేస్తున్నారు. ప్రభాస్ ‘శివుడి’ పాత్రలో నటిస్తున్నాడు, నయనతార ‘పార్వతిదేవి’గా నటిస్తోంది, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ఇతర ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.

ఈ కాస్టింగ్ చూస్తుంటే మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ సినిమానే చేస్తున్నాడు అనిపించకమానదు. కోట్లు ఖర్చు పెట్టి రిస్క్ చేస్తున్న మంచు విష్ణు ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్లే ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీపై నెగటివ్ కామెంట్స్ కంప్లీట్ గా తగ్గిపోయాయి. ఇక భక్త కన్నప్ప నుంచి పాజిటివ్ గా ప్రమోషనల్ కంటెంట్ బయటకి వస్తే చాలు మంచు విష్ణు కెరీర్ కంప్లీట్ గా టర్న్ అయిపోయినట్లే. ఆ రోజు దగ్గరలోనే ఉందంటూ మంచు విష్ణు ట్వీట్ చేసాడు. నవంబర్ 23 తెల్లవారుఝామున 2:45 నిమిషాలకి భక్త కన్నప్ప అప్డేట్ వస్తుంది అంటూ మంచు విష్ణు ట్వీట్ చేసాడు. మరి ప్రభాస్ శివుడి అప్డేట్ ఇస్తాడా లేక టైటిల్ లోగో రివీల్ చేస్తాడా లేక మరేదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ మంచు విష్ణు నుంచి వస్తుందా అనేది చూడాలి. ఈ అప్డేట్ పైనే భక్త కన్నప్ప ఫ్యూచర్ ప్రమోషన్స్ ఆధారపడి ఉన్నాయి కాబట్టి విష్ణు వీలైనన్ని సార్లు క్రాస్ చెక్ చేసుకోని ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేయాలి.

Show comments