Manchu Manoj with Bhuma Mounika to meet Chandrababu today: ఈ మధ్యనే మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. భూమా నాగిరెడ్డి- భూమా శోభా దంపతుల రెండవ కుమార్తె భూమా మౌనికను ఆయన ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి రెండు కుటుంబాలకు సంబంధించిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఆ తర్వాత భూమా మౌనికది పొలిటికల్ ఫ్యామిలీ కావడంతో మంచు మనోజ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందేమో అని అప్పట్లోనే అనేక ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. అయితే తనకు ఆసక్తి లేదని ఒకవేళ మౌనిక ఆసక్తి చూపిస్తే తాను ప్రోత్సహిస్తానని అప్పట్లోనే మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ దిశగా మంచు మనోజ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
సామజవరగమన సినిమాలో నరేష్ టీషర్టుల మీద ఈ కొటేషన్స్ చూస్తే నవ్వాపుకోలేరు
తాజాగా ఉన్న సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి కొన్నాళ్ల క్రితం మంచు మనోజ్ తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ అది ప్రచారానికే పరిమితమైంది. ఇప్పుడు ఏకంగా టిడిపి అధినేతను కలుస్తూ ఉండడంతో మరోసారి ఈ రాజకీయ ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. అయితే భూమా మౌనిక సోదరి భూమా అఖిలప్రియ రెడ్డి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే కొన్ని సమీకరణల దృష్యా ఆమెకు టికెట్ నిరాకరించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే భార్య తరఫున కర్నూలు జిల్లా నుంచి మంచు మనోజ్ యాక్టివ్ అవుతారా? లేక తమ తండ్రి ప్రాంతమైన చిత్తూరు జిల్లా నుంచి యాక్టివ్ అవుతారా విషయం మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది.