Site icon NTV Telugu

బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల… రెండవ పెళ్లిపై మంచు మనోజ్ ట్వీట్

Manchu-manoj

యంగ్ హీరో మంచు మనోజ్ సినిమాల నుంచి చిన్న విరామం తీసుకున్నాడు. అప్పుడప్పుడూ కొన్ని సామాజిక కార్యక్రమాల్లోనూ కనిపిస్తున్నాడు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో మంచు మనోజ్ కన్పించి వార్తల్లో నిలిచాడు. తన సోదరుడు విష్ణుకు సహాయం చేయడంతో పాటు రెండు ప్యానల్లు అనవసరమైన హింసకు పాల్పడకుండా చూసుకోవడానికి మనోజ్ తన శాయశక్తులా ప్రయత్నించాడు. ఆ తరువాత “భీమ్లా నాయక్” సెట్ లో పవన్ ను కలిశాడు. తాజాగా మనోజ్ రెండవ పెళ్లి వార్తలతో నెటిజన్ల దృష్టిలో పడ్డాడు. మంచు మనోజ్ త్వరలోనే రెండవ పెళ్లి చేసుకోనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా తన రెండవ పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై స్పందించాడు. మంచు హీరో త్వరలో పెళ్లి చేసుకోనున్నాడని, మనోజ్ ఒక విదేశీ యువతితో ప్రేమలో ఉన్నాడని, అయితే మోహన్ బాబు తన కుటుంబంలోని ఒకరితో మనోజ్ కు రెండో పెళ్లి జరిపించాలని ప్లాన్ చేస్తున్నాడని ఆ వార్తల సారాంశం. ఆ వార్తలను పంచుకున్న తన సోషల్ మీడియాలో షేర్ చేసిన మనోజ్ వ్యంగ్యంగా స్పందించారు.

Read Also : రికార్డు బ్రేకింగ్ ధర కు “రాధేశ్యామ్” డిస్ట్రిబ్యూషన్ రైట్స్

“దయచేసి నన్ను కూడా ఆహ్వానించండి … పెళ్లి ఎక్కడ ఉంది ? ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు?! మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం” అంటూ బ్రహ్మానందం షాకైన ఫోటోను యాడ్ చేశారు. మంచు మనోజ్ 2015లో హైదరాబాద్‌కు చెందిన ప్రణతిరెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2019లో విడిపోయారు. ప్రస్తుతం మంచు మనోజ్ “అహం బ్రహ్మాస్మి” సినిమా చేస్తున్నాడు.

Exit mobile version