Om Chapter 1: ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఓం చాప్టర్ 1′ (Om Chapter 1) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారన్న ఆసక్తి మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఉంది. ఈ రోజు (2026 సెప్టెంబర్ 7న) ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ క్యారెక్టర్ గ్లింప్స్ లో మమ్ముట్టి ‘బర్మా కార్తికేయన్’గా కనిపించి అదరగొట్టారు. గ్లింప్స్‌లో మమ్ముట్టి లుక్ చూస్తేనే ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది. ‘సియా’ గా పిలవబడే బర్మా కార్తికేయన్ ఒక స్మగ్లర్‌గా కనిపించనున్నారు. అయితే అతడిని కేవలం విలన్ తరహా పాత్రగా చూపించకుండా, తన చుట్టూ ఉన్న ప్రజలకు అండగా నిలిచే వ్యక్తిగా కూడా డిజైన్ చేసినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందిస్తున్న ఈ మైండ్-బ్లోయింగ్ యాక్షన్ డ్రామాలో ధనుష్, మమ్ముట్టి ఒక గ్యాంగ్‌స్టర్ కల్ట్ నెట్‌వర్క్‌లోని గురువు, శిష్యుడిగా రోల్స్ లో కనిపించబోతున్నారు. మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా నేడు రిలీజ్ చేసిన గ్లింప్స్ ప్రకారం.. ఆయన ఇంటర్‌పోల్ నిఘాలో ఉన్న ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా నాయకుడైన ‘బర్మా కార్తికేయన్’ (సియా) పాత్రను పోషిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో ధనుష్ హై-ఇంటెన్సిటీ ఉన్న ఒక లీడ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఇందులో ధనుష్, మమ్ముట్టితో పాటు సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘ఓం’ తెలుగు టైటిల్ టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 25న తెలుగు టైటిల్ టీజర్ విడుదల కాగా, సినిమా అక్టోబర్ 16 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంగీతం సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. మరి బర్మా కార్తికేయన్‌గా మమ్ముట్టి చూపించబోయే అసలు విధ్వంసం ఎలా ఉండబోతుందో తెలియాలంటే అక్టోబర్ 16 వరకు ఆగాల్సిందే.

