విడాకులు భార్యాభర్తలకేగానీ… అమ్మానాన్నలకు కాదు! బాలీవుడ్ లో ఈ రూల్ ఫాలో అవుతోన్న మాజీలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. గతంలో ప్రేమికులు విడిపోయినా, భార్యాభర్తలు విడిపోయినా ఇంకెక్కడా కలసి కనిపించే వారు కాదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. కపుల్ గా డైవోర్స్ తీసుకుని పేరెంట్స్ గా కంటిన్యూ అవుతున్నారు. రీసెంట్ గా ‘బై బై’ చెప్పేసుకున్న బాలీవుడ్ జంట ఆమీర్, కిరణ్ రావ్ కూడా అబ్బాయి ఆజాద్ కు అమ్మానాన్నలుగా కలసి ముందుకు సాగుతాం అన్నారు!
మమ్మీ, డాడీ ఆటలో ఆమీర్, కిరణ్ కంటే ఓ అడుగు ముందున్నారు అర్భాజ్, మలైకా. వీరిద్దరు 19 ఏళ్లు కాపురం చేశారు. అర్హాన్ ఖాన్ కు ప్రౌడ్ పేరెంట్స్ అయ్యారు. అతనికి ఇప్పుడు 18 ఏళ్లు. మరి తమ టీనేజ్ సన్ పట్ల మమ్మీ మలైకా, డాడీ అర్భాజ్ రెస్పాన్సిబుల్ గా ఉండాలి కదా! అందుకే, బాధ్యత మరిచిపోకుండా ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని ఓ హోటల్లో లంచ్ కి వచ్చారు. మలైకా, అర్హాన్ తో క్వాలిటీ టైం స్పెండ్ చేశాడు అర్భాజ్! ముగ్గురూ రెస్ట్రాంట్ నుంచీ బయటకు వస్తుంటే పాపరాజీ కెమెరాలు ఫ్లాష్ ల వర్షం కురపించేశాయి…
మలైకా, అర్భాజ్ ఖాన్ తనయుడు అర్హాన్ చదువు నుంచీ ఓ సంవత్సరం పాటూ గ్యాప్ తీసుకున్నాడు. బాలీవుడ్ ఎంట్రీ కోసమే ఈ గ్యాప్ అంటున్న వారు కూడా ఉన్నారు. అలా జరిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. సల్మాన్ లాంటి పెద్ద నాన్న ఉన్నాడు కాబట్టి అర్హాన్ కు బాలీవుడ్ లోకి రెడ్ కార్పెట్ రెడీగానే ఉంటుంది. చూడాలి మరి, ప్రస్తుతం చదువు ఆపేసి బ్రేక్ తీసుకుంటోన్న మలైకా ముద్దుల వారసుడు ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ అందిస్తాడో…
