Site icon NTV Telugu

Mazaka : ‘మజాకా’ నష్టాలు.. బయ్యర్స్ కు కోట్ల రూపాయల డబ్బు వెనక్కిచ్చిన నిర్మాత

Mazaka

Mazaka

సందీప్ కిషన్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘మజాకా’. ఈ చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్యమూవీస్ బ్యాన‌ర్‌ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరించారు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా వచ్చిన ఈ సినిమా. ఫిబ్రవరి 26న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

Also Read : Breaking : కేరళలో ‘కాంతార చాఫ్టర్ -1’ రిలీజ్ బ్యాన్ చేసిన ఎగ్జిబిటర్స్… కారణం ఇదే

ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన మజాకా ప్రేక్షకుల నుండి ప్లాప్ టాక్ తెచ్చకుతుంది. ఫస్టాప్ ను సరిగా డీల్ చేసిన డైరెక్టర్ సెకండాఫ్ లో చేతులెత్తేసాడు. రిలీజ్ కు ముందే మజాకా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. ఆ సంగతి అలా ఉంచితే నిర్మాత చెప్పిన రేట్ కు మజాకాను ఏరియాల వారీగా రైట్స్ కొనుగోలు చేసిన ఎగ్జిబిటర్స్ కు నష్టాలు మిగిల్చింది. మజాకా నష్టాలపై బయ్యర్స్ ఇటీవల నిర్మాత రాజేష్ దండతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం బయ్యర్స్ కు డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అమ్మిన రేటుని బట్టి వచ్చిన నష్టాలతో పాటు జిఎస్టీ కలిపి మొత్తం నాలుగు కోట్లు బయ్యర్లకు వెనక్కు ఇచ్చారు నిర్మాత రాజేష్ దండ. భారీ బడ్జెట్ లు స్టార్ లు పెట్టి కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీసి తీరా నష్టాలు వస్తే తిరిగి మళ్ళి నిర్మాత వెనక్కి ఇచ్చుకోవడాన్ని బట్టి చూస్తే సినిమా రంగం పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తన సినిమా కొని నష్టం వచ్చిన బయ్యర్స్ ను ఆదుకున్న రాజేష్ దండాను మెచ్చుకుని తీరాలి

Exit mobile version