Site icon NTV Telugu

SVP Pre Release : భావోద్వేగానికి గురైన మహేశ్‌ బాబు..

Mahesh Babu

Mahesh Babu

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు గీతాగోవిందం ఫేమ్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. నేడు హైదరాబాద్‌ యూసఫ్‌గూడాలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరుగుతోంది. అయితే ఈ వేడుకల్లో మహేశ్‌ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలో డైరెక్టర్‌ పరుశురాం ఎంతో గొప్పగా నా క్యారెక్టర్‌ను తీర్చిదిద్దారని, అంతేకాకుండా ఈ క్యారెక్టర నా కెరీయర్‌లో వన్‌ ఆఫ్‌ బెస్ట్‌గా ఉండబోతోందన్నారు. అంతేకాకుండా ఈ పాండమిక్‌లో ఎంతో దగ్గరి వారిని కోల్పోయానన్న మహేశ్‌బాబు.. అభిమానులు ఇలాగే ఎప్పుడు అండగా ఉంటే.. ధైర్యంగా ముందుకు వెళ్తానంటూ కొంచెం భావోద్వేగానికి గురయ్యారు.

Exit mobile version