తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘మహాన్’ ఫిబ్రవరి 10న విడుదల కానుంది. OTTలో గ్రాండ్ రిలీజ్‌కు ముందు మేకర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ ఇంటెన్స్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామాలో విక్రమ్ ప్రధాన పాత్రలో, ధృవ్ విక్రమ్, బాబీ సింహా, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also : ఫిబ్రవరి డిజిటల్ హంగామా… ఓటిటి సినిమాల లిస్ట్
ఈ ట్రైలర్ లో ఒక సాధారణ వ్యక్తి కథను చూడొచ్చు. ఆయనను కుటుంబం విడిచి పెట్టినప్పుడు ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? అనే విషయం, ట్రైలర్ లో ప్రతి బిట్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తూ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తోంది. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, మొదటిసారిగా విక్రమ్ రీల్ లైఫ్ కొడుకుగా ఈ సినిమాలో నటించాడు. ‘మహాన్’ జీవితం ఊహించని సంఘటనలతో కూడిన యాక్షన్-ప్యాక్డ్ కథనం. ఈ చిత్రం కథ అల్లుకున్న భావోద్వేగాలు, డ్రామాతో కూడిన యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా పేక్షకుల ముందుకు రాబోతోంది. ‘మహాన్’ ఫిబ్రవరి 10 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
