కోలీవుడ్‌లో ప్రస్తుతం భారీ అంచనాలున్న సినిమాల్లో ‘మహాన్’ ఒకటి. చియాన్ విక్రమ్, ధృవ్ విక్రమ్ తొలిసారిగా ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ఇప్పుడు అధికారికంగా విడుదలైంది. టీజర్ కొత్త అవతార్‌లో విక్రమ్‌ని చూపించింది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అభిమానులను ఆశ్చర్యపరిచాడు విక్రమ్. ‘మహాన్’ మద్యం వ్యాపారంలో బిలియనీర్ కావాలని అనుకుంటున్నట్టు, సిండికేట్‌కు అధిపతి అవుతాడని టీజర్ లో వెల్లడైంది. మరోవైపు ఈ పవర్ ప్యాక్డ్ టీజర్ లో ధృవ్ గురించి పెద్దగా చూపించలేదు మేకర్స్.
Read Also : సింగర్ సునీత మాస్టర్ ప్లాన్… రంగంలోకి వారసుడు
టీజర్ యావరేజ్‌గా అనిపించినా సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో విక్రమ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో ‘మహాన్’ ప్రపంచాన్ని చూడాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. ఫిబ్రవరి 10న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సిమ్రాన్, వాణీ భోజన్, బాబీ సింహా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
