NTV Telugu Site icon

Maguva o Maguva: ‘స్టార్ మా’లో కొత్తగా ‘మగువ ఓ మగువ’ సీరియల్

Maguva O Maguva

Maguva O Maguva

Maguva o Maguva to Telecast in Star MAA from 19th Febraury: తల్లీ కొడుకుల ప్రేమ అద్భుతం, ఆ అనుబంధం సృష్టిలోనే అపురూపం. ఆ బంధానికి, ఆ అనురాగానికి అద్దం పట్టే కథ తో స్టార్ మా “మగువ ఓ మగువ” పేరుతో సరికొత్త సీరియల్ ప్రారంభిస్తోంది. జీవితంలో ఓ కొత్త కోణాన్ని ఈ కథతో చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి మధ్యాహ్నం 1 గం.కి ప్రసారమయ్యే ఈ ధారావాహికను సోమవారం నుంచి శనివారం వరకు చూడవచ్చు. కొడుకు ఇష్టపడే ప్రతి వస్తువు అపురూపంగా దాచి అందులో కొడుకు జ్ఞాపకాలు గుర్తు చేసుకునే ఒక అత్తకి, ఆ వస్తువుల్లో ఒక వస్తువుగా ఆ ఇంట్లో ఉండిపోవాల్సిన ఒక కోడలికి మధ్య ఊహలకందని కథ ఇది. అత్తారిల్లు అంటే ఒక కొత్త కోడలు అడుగుపెట్టే ఒక కొత్త ప్రపంచం కావాలి కానీ అది బందిఖానా లానో, పంజరంలానో మారిపోతే ఆమె పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమే ఈ ధారా వాహిక.

అంతా సంతోషంగా ఆనందంగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో జరగరాని సంఘటన అటు తల్లినీ, ఇటు భార్యనీ కలవరపెట్టింది. తర్వాత ఎదురయ్యే పర్యవసానాలను అత్త, కోడలు ఎలా ఎదుర్కొన్నారో మనసుని తట్టేలా చెబుతుందీ కథ. దేవుడు ఒక దారి మూస్తే, మరో దారి చూపిస్తాడన్న పెద్దలు చెప్పినట్టు.. కోడలికి ఒక ఆశ కనిపిస్తుందేమో అని ఎదురుచూసిన చోట.. కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
ఇది ఓ మగువ కథ. ఆమె జీవితంలో ఊహించని సంఘటనల మధ్య జరిగిన ప్రయాణం చేసిన కథ. అత్తగారి నుంచి ప్రేమ దొరకడం లేదు అని ఎందరో కోడళ్ళు కుమిలిపోతున్న ఈ రోజుల్లో – ఈ కథలో కోడలికి దొరికిన ప్రేమ ఆమెకు ఇబ్బందిగా మారిపోతే ఆమె జీవితం ఏమవుతుందన్నదే పెద్ద ప్రశ్న. కనికరించని పరిస్థితులు, కలిసిరాని అనుబంధాల మధ్య ఈ తరం మగువ ఎలా నెగ్గుకు వచ్చింది తెలుసుకోవాలంటే చూడండి “మగువ ఓ మగువ”. ఈ నెల 19న ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 1 గం.కు ప్రసారమవుతుంది.