టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. నూతన దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 12 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం సినిమాలోని ఒక్కొక్క పాటను రిలీజ్ చేస్తూ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి ఒక ప్రత్యేక పాటలో మెరుస్తున్న విషయం విదితమే. రారా రెడ్డి అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ పాటలో అంజలి, నితిన్ కాంబో అల్టిమేట్ అని చెప్పాలి. అంజలి అందచందాలు.. నితిన్ ఊర మాస్ స్టెప్పులు సాంగ్ కు హైలైట్ గా నిలిచాయి. కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ ను అంతే హస్కీగా పాడి మెస్మరైజ్ చేసింది లిప్సిక.. ఇక రారా రెడ్డి ఫుల్ సాంగ్ జూలై 9 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. గుంటూరు కలెక్టర్ సిద్దార్థ్ రెడ్డి గా నితిన్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
