Site icon NTV Telugu

Jo Sharma: ఆస్కార్ 2025లో త‌ళుక్కుమ‌న్న టాలీవుడ్ హీరోయిన్

Jo Sharma

Jo Sharma

తెలుగులో రూపొందుతున్న ‘ఎం4ఎం’ (Motive for Murder) మూవీ హీరోయిన్ జో శర్మకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనే అరుదైన అవకాశం లభించింది. ఈ అద్భుత‌మైన‌ వేడుక‌లో భాగమవ్వడం ఎంతో ఆనందంగా ఉందని, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ పాప్ సింగర్, నటి అరియానా గ్రాండేను దగ్గరగా చూడటం అద్భుతమైన అనుభూతి అని జో శర్మ తన ఆస్కార్ అనుభ‌వాలను పంచుకుంది. “ఈ క‌ల‌ర్‌ఫుల్ ఈవెంట్‌ను సమీపంగా వీక్షించడం ఎంతో మధురమైన అనుభూతి” అని జో శర్మ చెప్పుకొచ్చారు.

అదే విధంగా, ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఎం4ఎం’ (Motive for Murder) సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. భారత్‌తో పాటు అమెరికాలో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయని టీం చెబుతోంది. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా జో శర్మ 40 అమెరికన్ నగరాలను సందర్శించే ప్రచార యాత్ర ప్రారంభించారు. M4M మూవీకి అభిమానుల నుంచి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు అందించాలని కోరారు.

Exit mobile version