Site icon NTV Telugu

Ninnu Vadalanu: నిన్ను వదలను అంటున్న రష్యా భామ

Russia

Russia

Ninnu Vadalanu: రష్యా నటి లియుబా షామ్‌, కుష్బు జైన్‌ ముఖ్యపాత్రల్లో యు వీ టి హాలీవుడ్ స్టూడియో (యూఎస్ఏ) మరియు శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ సంయుక్తంగా అశోక్ కుల్లర్ నిర్మాతగా దేవేంద్ర నెగి సహ నిర్మాతగా షిరాజ్ మెహది దర్శకత్వంలో వస్తున్న సినిమా “నిన్ను వదలను”. గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోవా హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగే ఈ సినిమా హర్రర్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. లియుబా పామ్ రష్యాలో పుట్టి పెరిగారు. ఆమె ఒక సింగర్ మరియు ప్రొడ్యూసర్ కూడా

Also Read: SSMB29: మహేష్ బాబు సినిమలో విలన్ గా మలయాళం స్టార్ హీరో..?

రష్యాలో సేవ్ ద చిల్డ్రన్ అని ఒక డాక్యుమెంటరీ ఫిలిం కి నిర్మాతగా మరియు లవ్ ఓవర్ ఈవిల్ అనే టీవీ సిరీస్ కి రైటర్ మరియు నిర్మాత గా వ్యవహరించారు. ఇప్పుడు స్ట్రైట్ తెలుగులో నిన్ను వదలను అనే హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. దర్శకుడు షిరాజ్ మాట్లాడుతూ ‘హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశమిది. రష్యా సింగర్‌, ప్రొడ్యూసర్‌ అయిన లియుబా షామ్‌ ఈ సినిమా ద్వారా తెలుగులో అరంగేట్రం చేస్తున్నది. గోవా, హైదరాబాద్‌ నేపథ్యంలో కథ సాగుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమరామెన్ ప్రవీణ్‌ కొమరి పని చేయనున్నారు.

Exit mobile version