NTV Telugu Site icon

Lucky Baskhar: అక్టోబర్ 30 నుంచి ‘లక్కీ భాస్కర్’ ప్రీమియర్ షోలు

Luckybaskhar

Luckybaskhar

Lucky Baskhar Locked the Release of the Film for Diwali holiday on 31st October: వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది.

Devara: దేవర కలెక్షన్స్.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు

తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలను పంచుకున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ నెల 21వ తేదీన ట్రైలర్ విడుదల చేయబోతున్నాం. అప్పటి నుండి అందరూ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటిదాకా నేను తీసిన సినిమాల్లో ఇది విభిన్న చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాను.” అన్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “దేవర, ఇతర దసరా సినిమాల హడావుడి పూర్తయ్యాక ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాలని ఉద్దేశంతో ఇప్పటిదాకా ఆగాము. ఇక నుంచి వరుసగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాము. అక్టోబర్ 21న ట్రైలర్ విడుదల చేస్తాము. అక్టోబర్ 26 లేదా 27 తేదీల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నాము. అక్టోబర్ 30 నుంచి ప్రీమియర్లు ప్రదర్శించనున్నాము. సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాము. అందుకే ముందు రోజు సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించాము.” అన్నారు. ఈ సందర్భంగా విలేఖర్లు అడిగిన పలు ప్రశ్నలకు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ బదులిచ్చారు.

Show comments