Leo Telugu Producer Nagavamsi says he did not like the film: తెలుగు నిర్మాత నాగ వంశీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కొన్నిసార్లు వివాదాలకు కూడా కేంద్ర బింధువుగా మారుతూ ఉంటాడు. తాజాగా ఆయన లియో సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు విషయం ఏమిటంటే విజయ్ హీరోగా నటించిన లియో సినిమా తెలుగు హక్కులను నాగ వంశీ కొనుక్కున్నాడు. కొనుక్కుని రెండు తెలుగు రాష్ట్రాలలో లియో సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ సినిమాను 20 కోట్లకు కొనుగోలు చేసి పండుగ సీజన్ కావడంతో బాగానే వెనకేసుకున్నాడని టాక్. మొదటి వారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా జనాలు అందరూ థియేటర్లకు వెళ్లడంతో మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంది. ఆ తరువాత సినిమా దారుణంగా వసూళ్ల విషయంలో డ్రాప్ అయిపోయింది. అయితే తాజాగా విజయ్ అభిమానులతో పాటు సినీ అభిమానులందరికీ షాక్ ఇచ్చే విధంగా నాగ వంశీ అసలు ఈ లియో సినిమా తనకు నచ్చలేదంటూ కామెంట్లు చేశాడు.
L2E Empuraan: లూసిఫర్ సీక్వెల్ కోసం పాక్ భామ
తాజాగా ఒక మీడియా హౌస్ నిర్వహించిన చర్చా గోష్ఠిలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ సినిమా తనకు నచ్చలేదని చెప్పుకొచ్చాడు. అంతేకాదు లియో సినిమా రిలీజ్ కాకముందే ఇదే తన మొదటి చివరి డబ్బింగ్ సినిమా అని ఇకమీదట ఎలాంటి డబ్బింగ్ సినిమాలు జోలికి వెళ్లనని కూడా ఆయన చెప్పకొచ్చాడు. నెట్‌ఫ్లిక్స్‌లో, లియో OTT వెర్షన్ ఇప్పుడు భారతదేశంలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీలో ప్రసారం చేయబడుతోంది. త్వరలో ఇంగ్లిష్‌లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇయల్, మన్సూర్ అలీ ఖాన్, మిస్కిన్, మడోన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించింది.