Leo cinematographer reveals a shocking twist of flashback: లియో మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 19న తమిళ సహా తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఇక తాజాగా లియో సినిమాటోగ్రాఫర్ సినిమా ఫ్లాష్‌బ్యాక్ గురించి షాకింగ్ ట్విస్ట్‌ను వెల్లడించారు. లియో థియేటర్లలో విడుదలైనప్పటి నుండి, లియో ఫ్లాష్‌బ్యాక్‌కి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ ఇంత స్టుపిడ్ పాయింట్ ఎందుకు తీసుకున్నాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే సినిమా సినిమాటోగ్రాఫర్ ఫ్లాష్‌బ్యాక్ గురించి షాకింగ్ ట్విస్ట్ బయట పెట్టాడు. లియో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస తాజా ఇంటర్వ్యూలో ఫ్లాష్‌బ్యాక్ గురించి షాకింగ్ ట్విస్ట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. “ఫ్లాష్‌బ్యాక్ తప్పు కూడా కావచ్చు, మేము దాని గురించి కొన్ని నిమిషాలు చూపించాలి కాబట్టి చూపించాం. అపరిచితుడు (మన్సూర్) ఆ పోర్షన్ గురించి చెప్పినప్పుడు అది కూడా నకిలీ కావచ్చు అని లోకేష్ చెప్పాడు” అని మనోజ్ అన్నారు.
Leo Producer: ఈ సినిమా వెయ్యి కోట్లని టచ్ చెయ్యదు…
ఈ పాయింట్ నిజమని కొందరు అభిమానులు విశ్వసిస్తున్నప్పటికీ, చిత్ర బృందం నుండి ఇది చాలా సిల్లీ కవర్ డ్రైవ్ అని కొందరు పేర్కొంటున్నారు. ప్రేక్షకులు మూర్ఖులు కాదని, తప్పుడు ఫ్లాష్‌బ్యాక్ చూపడమే మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే, వారు చివర్లో కనీసం వాయిస్‌ఓవర్ ద్వారా అయినా వెల్లడించి ఉండాల్సిందని కొందరు అంటున్నారు. ఎందుకంటే సినిమా ఒక దృశ్య మాధ్యమం, రచయిత లేదా కెమెరా మేన్‌లోని ఆలోచనలను ప్రేక్షకులు పసిగట్టలేరు కదా. ఇలా కొన్ని సిల్లీ థియరీలు రిలీజ్ తరువాత చెప్పే బదులు ఫ్లాష్ బ్యాక్ బాగోలేదని మేకర్స్ అంగీకరించాల్సిందే అంటున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే, లియో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 148 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 2వ రోజు ఇండియా గ్రాస్ 44 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో 30 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. మొత్తం 2 రోజుల గ్రాస్ 220Cr కంటే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.