NTV Telugu Site icon

Irrfan Khan: మహానటుడి చివరి హిందీ సినిమా రిలీజ్ అవుతోంది…

Irrfan Khan

Irrfan Khan

‘ఆర్ట్’ వలన ఎంతోమందికి పేరొస్తుంది కానీ అతి తక్కువ మంది వలన మాత్రమే ‘ఆర్ట్’కే పేరొస్తుంది. అలా ‘యాక్టింగ్ ఆర్ట్’కే గౌరవం తెచ్చిన అతి కొద్ది మంది ఆర్టిస్టుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. విలక్షణ నటనతో, ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించగల విలక్షణతో హిందీ పరిశ్రమ దాటి వరల్డ్ సినిమాలోకి ఎంటర్ అయ్యారు. ఇండియన్ సినిమా చూసిన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ 2020 ఏప్రిల్ 29న న్యూరోఎండోక్రైన్ క్యాన్సర్ కారణంగా మరణించారు. సినిమాలకే తీరని లోటుగా మిగిలిపోయిన ఇర్ఫాన్ ఖాన్, నటించిన ఆఖరి హిందీ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. ఏప్రిల్ 29న ఇర్ఫాన్ ఖాన్ మరణించగా, ఏప్రిల్ 28న ఆ లెజెండ్ చివరి సినిమా ‘ది సాంగ్ అఫ్ స్కార్పియన్స్’ రిలీజ్ కానుంది. అనుప్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. రాజస్తాన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఒంటెలని అమ్మే వ్యాపారిగా ఇర్ఫాన్ ఖాన్ కనిపించగా, ఇరాన్ యాక్ట్రెస్ ఫరాహని ‘నూరన్’ అనే గ్రామీణ యువతి పాత్రలో నటిస్తోంది.

ఒక ఫోక్ లోర్ ప్రకారం రాజస్తాన్ లో ఒక తెలు కుడితే 24 గంటల్లో మనిషి చనిపోతాడు అనే విషయాన్ని కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ తెలు కుట్టిన సమయంలో ‘నూరన్’ అనే అమ్మాయి వచ్చి పాట పాడితే, తెలు విషం ప్రభావం తగ్గి మనిషి బ్రతుకుతాడు అనేది అక్కడి ప్రజల నమ్మకం. ఎన్ని వందల సంవత్సరాలుగా రాజస్తాన్ ప్రజలు నమ్ముతున్న ఈ ఫోక్ లోర్ ని బేస్ చేసుకోని ‘ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్’ సినిమా రూపొందింది. ఇలా పాటతో తేలు విషం తీసే నూరన్ ని పాట పాడుతున్న సమయంలో చూసి ప్రేమించిన, ఆదామ్ అనే వ్యక్తిగా ఇర్ఫాన్ నటించాడు. పొయిటిక్ కథ, అంతే మిస్టిక్ విజువల్స్ ‘ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్’ ట్రైలర్ ని అందరికీ నచ్చేలా మార్చాయి. ఇర్ఫాన్ ఖాన్ ని ట్రైలర్ లో చూస్తుంటే ఎవరికైనా ఆయన చేసిన సినిమాల తాలూకు జ్ఞాపకాలు గుర్తు రావడం గ్యారెంటీ. ఆ లెజెండ్ లాస్ట్ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ వెల్కమ్ లభించడం గ్యారెంటీ.

Show comments