NTV Telugu Site icon

Laya: చంపుకోండి.. .పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ కి లయ షాక్!

Laya

Laya

Laya was Threatened by a Tollywood Director: ఒకప్పుడు హీరోయిన్గా అనేక సినిమాలు చేసి తర్వాత వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. లయ చాలా కాలం తర్వాత ఆమె తిరిగి ఇండియా రావడం కాక వరుసగా యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తూ ఉండడంతో ఆమె టాలీవుడ్ రి ఎంట్రీ కోసం ప్రయత్నిస్తుందని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే నితిన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో ఆమె నితిన్ అక్క పాత్రలో నటిస్తోంది. అలా ఆమె టాటా బిర్లా మధ్యలో లైలా సినిమా తర్వాత తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఆమె ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాంకి అతిథిగా హాజరైంది. త్వరలో ప్రసారం కాబోతున్న ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ఈరోజు రిలీజ్ చేశారు.

Nagababu: అల్లు ఆర్మీ దెబ్బ.. ట్విట్టర్ డీ యాక్టివేట్ చేసిన నాగబాబు!

ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో ద్వారా అనేక విషయాలను అలీ రాబట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా లయ అమెరికా వెళ్లి అక్కడ ఇబ్బందులు పడుతోందని రోడ్డు మీద అడుక్కునే స్థితిలో ఉందంటూ వచ్చిన రూమర్స్ గురించి అలీ ప్రశ్నిస్తే ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఏమీ లేకుండా ఎందుకు ఇలాంటి వార్తలు పుట్టిస్తారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు అడుక్కోవడం కంటే దారుణమైన విషయాలు కూడా చేసినట్లు ప్రచారం చేశారని, అది కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది. ఇక అలీతో నటించిన సినిమాల గురించి కూడా ఆమె ప్రస్తావించింది. అప్పటి సినిమా గుర్తులను పంచుకుంది, ఇక తన సినిమా కెరియర్ లో కొన్ని తప్పులు కూడా చేశానని ఆమె కామెంట్ చేసింది.

స్వయంవరం లాంటి సూపర్ హిట్ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయడం కరెక్ట్ కాదని ఆయన అలాంటి డైరెక్టర్ అడిగితే కాదనలేకపోయాను కానీ ఒక పెద్ద హిట్ సినిమా తర్వాత నేను చేసిన చెత్త సినిమా అదేనని చెప్పుకొచ్చింది. ఇక ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ మీ మీద దాడి చేయడానికి ప్రయత్నించాడట కదా అని అడిగితే దానికి ఆమె పార్కింగ్లో ఉండగా ఒక డైరెక్టర్ నన్ను ఆపాడు. ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో చూస్తానని అన్నాడు. అయితే నేను అప్పుడు వచ్చేసాను ఆ తర్వాత ఫాలో అయ్యాడు తర్వాత నేను ఒకటే సమాధానం ఇచ్చాను. ఇక్కడ ఎవరూ లేరు ఒంటరిగా ఉన్న మీరు ఒంటరిగా ఉన్న నన్ను కావాలంటే చంపేసుకోండి అంటూ తాను అనడంతో ఆ వ్యక్తి వెనక్కి తగినట్లు ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయం మీద ప్రోమోలో క్లారిటీ ఇవ్వలేదు బహుశా ఫుల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Show comments