Site icon NTV Telugu

Korameenu: అందాల రాక్షసి చేతుల మీదుగా ‘కొరమీను’ మోషన్ పోస్టర్!

Korameenu

Korameenu

Lavanya Tripathi: జాలరిపేట నేపధ్యంలో సాగే సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘కొరమీను’. ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆనంద్ రవి, హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోర్ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, ‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయేల్ నటీనటులుగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మించారు. ఈ ‘కోరమీను’ మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ రోజు విడుదల చేశారు. మోషన్ పోస్టర్ చూస్తుంటే ఆకాశంలో విపరీతమైన మబ్బులతో మేఘవృతంమై ఉరుములు మెరుపుల మధ్య జాలర్లు పట్టే కొన్ని వందల బోట్లు కనిపించగా అందులోని ఒక బోట్ పై ‘మీసాల రాజ్ మీసాలు ఎవరో కత్తిరించారా! ఎందుకు?’ అంటూ పోస్టర్‌లోని బీజీఎం, సెట్టింగ్, పోస్టర్ చూస్తుంటే ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తోంది. అక్కడే ఒక యువకుడు సీరియస్ గా ఎంతో తీక్షణమైన లుక్‌తో చూసే విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది.

ఈ సందర్బంగా దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ, ”మా చిత్ర మోషన్ పోస్టర్ ను లావణ్య త్రిపాఠి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. జాలారిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో సాగే కథ ఇది. సరదా, ప్రేమగల ఓ డ్రైవర్, అహంకారి, ధనవంతుడు అయిన అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు… ఇలా మూడు ముఖ్యమైన పాత్రలతో మంచి కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఆనంద్ రవి అందిస్తున్నారు. స్వరాలను అనంత నారాయణ ఎ.జి, నేపథ్య సంగీతాన్ని సిద్ధార్థ్‌ సదాశివుని సమకూర్చుతున్నారు.

https://youtu.be/SvQcrSzJczs

Exit mobile version