Vishwak -Arjun Issue: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు డైరెక్టర్, నటుడు అర్జున్ ట్విస్ట్ ఇచ్చాడా..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గత కొన్ని రోజులుగా విశ్వక్ కు అర్జున్ కు మధ్య సినిమా వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. తన సినిమాను ఒప్పుకొని, అడ్వాన్స్ కూడా తీసుకొని విశ్వక్ షూటింగ్ రాలేదని అర్జున్ చెప్పుకొచ్చాడు. తనకు సెట్ లో విలువ ఇవ్వని కారణంగా తాను ఈ సినిమా నుంచి తప్పుకొంటునట్లు విశ్వక్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీరిద్దరి గొడవ ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్ళింది. ఇక ప్రెస్ మీట్ లో అర్జున్ మాట్లాడుతూ డబ్బు కోసం ఈ సినిమా చేయడం లేదని, తన కూతురును గ్రాండ్ గా టాలీవుడ్ లో లాంచ్ చేయడానికి సినిమా తీస్తున్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ హీరో కాకపోతే ఇంకో హీరో.. సినిమా ఇండస్ట్రీ ఆగిపోదు.. సినిమాలు నడుస్తూనే ఉంటాయి.. త్వరలోనే మరో హీరోతో ఈ సినిమా చేస్తానని అర్జున్ చెప్పాడు.
ఇక చెప్పినట్లుగానే అర్జున్, మరో కుర్ర హీరోకు కథ వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే ఒక జీవితంతో డీసెంట్ హిట్ ను అందుకున్న శర్వానంద్ ను అర్జున్ కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వక్ కు వినిపించిన కథనే అర్జున్, శర్వా కు చెప్పడం.. అతను కూడా ఓకే అనడం జరిగాయట. అయితే సెకండ్ హాఫ్ లో కొద్దిగా మార్పులు చేసి మరోసారి వినిపించాలని శర్వా కోరడంతో అర్జున్ సైతం అంగీకరించాడని టాక్. ఒక వేళ ఇదే కనుక నిజామియాట్ విశ్వక్ ఇది పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. ఈ వివాదం ఇంకా సద్దుమణగకముందే అర్జున్ సినిమా తీసి హిట్ కొట్టాడా..? విశ్వక్ కు అది పెద్ద అవమానమే అవుతోంది అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.
