పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్”. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకులకు సినిమా వాయిదా వల్ల కలిగిన నిరాశను తీర్చడానికి మేకర్స్ బ్లాస్టింగ్ అప్డేట్ ను ప్లాన్ చేశారు. న్యూఇయర్ సెలెబ్రేషన్స్ లో మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ అది. తాజాగా ఈ సినిమా నుంచి ‘లాలా భీమ్లా’ సాంగ్ కు సంబంధించిన డీజే వెర్షన్ రానుందని ప్రచారం జరుగుతోంది. అదే విషయమై తాజాగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ‘భీమ్లా నాయక్’ నుంచి బ్లాస్టింగ్ అప్డేట్… న్యూఇయర్ సెలెబ్రేషన్స్ కోసం డిసెంబర్ 31న సాయంత్రం 7 : 02 గంటలకు ‘లాలా భీమ్లా’ సాంగ్ డీజే వెర్షన్ విడుదల కానుందని తాజాగా ప్రకటించారు.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి పాత్రలను రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన రెండు టీజర్‌లతో పాటు ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ అభిమానుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ చిత్రంలో గిరజాల జుట్టు గల అమ్మాయి నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కూడా హీరోయిన్లుగా నటించారు. “భీమ్లా నాయక్”ను నాగ వంశీ నిర్మించగా, థమన్ సంగీతం అందించారు. కాగా ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25 న థియేటర్లలోకి వస్తుందని భీమ్లా నాయక్ నిర్మాతలు కొద్ది రోజుల క్రితం అధికారికంగా ధృవీకరించారు.
