Site icon NTV Telugu

Lal Salaam: ఈగల్ రిలీజ్ రోజే దిగుతున్న లాల్ సలామ్

Lal Salaam

Lal Salaam

Lal Salaam to Release on Febraury 9th: సూపర్ స్టార్ రజినీకాంత్‌ గత ఏడాది జైలర్ మూవీ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ సాధించి రజినీకాంత్‌ కమ్ బ్యాక్ మూవీ గా నిలిచింది. జైలర్ మూవీ ఇచ్చిన జోష్ లో రజినీకాంత్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రజినీకాంత్ నటిస్తున్న సినిమాలలో లాల్‌ సలామ్‌ మూవీ ఒకటి. ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌, ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సుభాస్కరణ్‌ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.. ‘3’ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రజినీకాంత్‌ ఆ తర్వాత ‘వాయ్‌ రాజా వాయ్‌’ మరియు ‘సినిమా వీరన్‌’ సినిమాలు తెరకెక్కించింది.

Ayalaan: సినిమా గురించి తప్పుడు రాతలు రాయకండి.. అయలాన్ నిర్మాత ఫైర్

చాలా రోజుల తర్వాత తండ్రీకూతుళ్ల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో లాల్ సలామ్ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్నందుకు ఈగల్ సినిమాకి ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ డేట్ ఇచ్చారు. అయితే అంతకు ముందు రోజు యాత్ర 2 సినిమా రిలీజ్ అవుతుండగా అదే రోజు ఊరి పేరు భైరవ కోన కూడా రిలీజ్ కి రెడీ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా అదే డేట్ కి వస్తూ ఉండడం గమనార్హం. రజినీకాంత్‌ మరోవైపు జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం లో తలైవా 170 సినిమాను కూడా ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. అలాగే దీంతోపాటు రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్‌ డైరెక్షన్‌ లో తలైవా 171లో కూడా నటిస్తున్నారు.

Exit mobile version