Site icon NTV Telugu

బంగార్రాజు : ఆకట్టుకుంటున్న “లడ్డుండా” మాస్ సాంగ్

Bangarraju

Bangarraju

అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “బంగార్రాజు”. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఈ సినిమాలోని “లడ్డుండా” అనే మాస్ సాంగ్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. నాగ్ స్వయంగా పాటను పాడాడు. నాగ్ సరదాగా ఈ సాంగ్ ను పాడినప్పటికీ తన గాత్రంతో ఈ సాంగ్ స్టైల్‌గా మారింది. మొదట్లో ఆయన చెప్పిన గోదావరి యాస డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. “లడ్డుండా” పాటను నాగ్ తో పాటు చిత్రంలోని రంభ, ఊర్వశి, మేనకలపై చిత్రీకరించారు. సాంగ్ లో నాగ్ ట్రేడ్‌మార్క్ పంచెకట్టు అవతార్ మరొక ప్రధాన హైలైట్. ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల రచించిన ఈ సాంగ్ కు ధనుంజయ్, మోహన బోగరాజు, నూతన మోహన్, హరిప్రియ అదనపు గాత్రాన్ని అందించారు. సంగీత స్వరకర్త అనూప్ రూబెన్స్ మరోసారి సూపర్ సౌండ్‌ట్రాక్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. లిరికల్ వీడియో ప్రకారం నాగ్ షూటింగ్ సమయంలో సరదాగా గడిపినట్లు అనిపిస్తుంది. బిగ్ స్క్రీన్ పై ఆయన మాస్ డ్యాన్స్ చూడడం కోసం అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

Read Also : విజయ్ సేతుపతిని తంతే నగదు బహుమతి… హిందుత్వ సంస్థ షాకింగ్ ప్రకటన !!

“బంగార్రాజు” కొత్త షెడ్యూల్ ఈ రోజు మైసూర్‌లో ప్రారంభమైంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి, రమ్యకృష్ణ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్‌లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.

Exit mobile version