కన్నడిగులు సోషల్ మీడియాలో బుధవారం #BoycottRRR వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో సినిమాను తెలుగులో విడుదల చేయడంపై శాండిల్ వుడ్ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. అయితే కర్ణాటకలో ‘RRR’ని పంపిణీ చేస్తున్న KVN ప్రొడక్షన్స్ వారి అసంతృప్తిపై స్పందిస్తూ ఇప్పుడు కన్నడ భాషలో మాగ్నమ్ ఓపస్‌ను విడుదల చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. అభిమానులను ఉద్దేశించి ప్రొడక్షన్ హౌస్ చేసిన పోస్ట్ లో ‘ఆర్ఆర్ఆర్’లోని ప్రధాన నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కన్నడ నేర్చుకోవడానికి, మొదటిసారిగా తమ సొంత వాయిస్‌లో డబ్బింగ్ చెప్పడానికి ప్రత్యేక కృషి చేశారని చెప్పుకొచ్చారు.
Read Also : Samantha : ఎట్టకేలకు చైని ఫాలో చేయడం ఆపేసిన బ్యూటీ
“మీరు కన్నడ భాషలో ‘ఆర్ఆర్ఆర్’ని చూసేందుకు ఇష్టపడతారని మేము అర్థం చేసుకున్నాము. అందువల్ల RRR కన్నడ వెర్షన్‌ను ప్లే చేయడానికి ఇష్టపడని థియేటర్ యజమానులను ఒప్పించే చర్య పూర్తి స్వింగ్‌లో ఉంది” అని ప్రకటించి కన్నడ ప్రేక్షకులను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. కన్నడ వెర్షన్‌ను అన్ని స్క్రీన్‌లలోకి తీసుకువస్తామని ప్రొడక్షన్ హౌస్ హామీ ఇచ్చింది. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ దేశవ్యాప్తంగా మార్చ్ 25న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ కూడా ఉన్నారు.
