కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థగా ఎదిగిన KVN ప్రొడక్షన్స్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది, భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్-ఇండియా ప్రాజెక్టులతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యానర్, వరుస ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకవైపు సెన్సార్ చిక్కులు, మరోవైపు అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఈ నిర్మాణ సంస్థను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టినట్లు కనిపిస్తోంది. దళపతి విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన తరుణంలో సెన్సార్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో విడుదల నిలిచిపోయింది. ఇది సంస్థకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ధ్రువ సర్జా కథానాయకుడిగా 2022లోనే ప్రారంభమైన ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ జరుపుకుంటూనే ఉంది, ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలు మారినా, ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో స్పష్టత లేదు, సుదీర్ఘ కాలం ప్రొడక్షన్ దశలో ఉండటం వల్ల వడ్డీల భారం పెరిగిపోతోంది.
Also Read: Ram Charan: చరణ్ ఫాన్స్’కి బ్యాడ్ న్యూస్
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అయితే, తాజాగా గల్ఫ్ రీజియన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా సినిమా విడుదలను జూన్ 4, 2026కి వాయిదా వేశారు. గల్ఫ్ దేశాలు భారతీయ సినిమాలకు అతిపెద్ద మార్కెట్ కావడం, అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నిర్మాతలు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ వరుస వాయిదాల వల్ల KVN ప్రొడక్షన్స్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అయితే, ఇంతటి సంక్షోభంలోనూ ఈ సంస్థ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే తెలుగులో భారీ క్రేజ్ ఉన్న హీరోలతో క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టింది. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో సినిమాను ప్రకటించి సంచలనం సృష్టించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కూడా ఓ భారీ సినిమా చేయడానికి ఒప్పందాలు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతటి పెద్ద నిర్మాణ సంస్థకైనా ఒడిదుడుకులు సహజం. అయితే KVN ప్రొడక్షన్స్ వంటి సంస్థకు ‘టాక్సిక్’, ‘KD’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం అత్యంత కీలకం. ఈ గడ్డు కాలాన్ని దాటుకుని, తెలుగు, కన్నడ భాషల్లో ఈ బ్యానర్ ఎంతవరకు నిలదొక్కుంటుంది అనేది చూడాలి.
