Site icon NTV Telugu

ChaySam Divorce: విడిపోవ‌డానికి కారణం.. మూడో వ్య‌క్తి?: ఖుష్బూ

సమంత, నాగచైతన్య విడాకుల ముచ్చట ఇటు టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్, బాలీవుడ్ లోను చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ తో పాటే సినీ సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. అయితే అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని సీనియర్ నటి ఖుష్బూ కోరింది.

‘భార్యభర్తల మధ్య ఏం జరిగిందనేది..? వాళ్ళు ఎందుకు విడిపోయారు..? అనేది వాళ్ళిద్దరికీ తప్ప మూడో వ్య‌క్తికి తెలిసే ఛాన్స్ లేదని ఖుష్బూ తెలిపింది. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి వాళ్లకు కాస్త సమయం ఇవ్వాలి. అంతేగాని, అనవరసరమైన రూమర్స్‌ సృష్టించవద్దు’ అని ఖుష్బూ కోరింది.

Exit mobile version