KU Mohanan Comments about Malavika Mohanan: ఇండియా టాప్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందారు కేయూ మోహనన్. డాన్, తలాష్, అంధధూన్ వంటి బాలీవుడ్ సూపర్ హిట్స్ తో పాటు తెలుగులో మహేష్ బాబు మహర్షి సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారారు. కేయూ మోహనన్ తెలుగులో వర్క్ చేసిన లేటెస్ట్ మూవీ హీరో విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్”. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, నిర్మించిన ఈ సినిమాకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా “ఫ్యామిలీ స్టార్” సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు పనిచేసిన ఎక్సీపిరియన్స్ షేర్ చేశారు సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్.
Thaman: జరగండి సాంగ్ కూడా కాపీ ఏనా.. థమన్ ఏంటి మళ్ళీ దొరికేశాడు?
ఈ క్రమంలోనే తన కూతురు మాళవిక మోహనన్ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తన కుమార్తె ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందని ఆయన అన్నారు అయితే తన కూతుర్ని హీరోయిన్గా ఎవరికి రికమండ్ చేయబోను అని అంటూ కామెంట్ చేశారు. ఎందుకంటే తన ఎథిక్స్ కి అవి విరుద్ధం అని ముందు నుంచి భావిస్తూ వచ్చాను కాబట్టి ఆమెను ఎవరికి రికమండ్ చేయలేదు, చేయబోను అని చెప్పుకొచ్చారు. అయితే నా కుమార్తెగా ఆమెకు ఈజీ ఆక్సిస్ లభిస్తుంది అని అయితే చెప్పగలను, మోహనన్ కుమార్తెను అని చెప్పుకొని ఆమె ఈజీగా ఇతరుల కంటే బెటర్ గా సినిమా ఆఫీసు లోపలికి వెళ్ళగలదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆమె స్క్రిప్ట్ సెలక్షన్ ఆమెదేనని తాను ఎలాంటి సలహాలు ఎప్పుడూ ఇవ్వనని అన్నారు. ఒకవేళ ఆమె ఎంచుకున్న ఈ నటనా రంగంలో ఆమె నిలబడితే ఆ క్రెడిట్ అంతా ఆమెకే దక్కాలి తప్ప తనకి దక్కకూడదని, అందుకే ఆమెను ఆమె చేయాలనుకున్న సినిమాలను చేయనిస్తున్నామని చెప్పుకొచ్చారు.
