Site icon NTV Telugu

అక్కినేని హీరోను రిజెక్ట్ చేసిన ‘ఉప్పెన’ బ్యూటీ ?

Kriti Shetty rejects Bangarraju Offer ?

ప్రస్తుతం టాలీవుడ్ లో కృతి శెట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. “ఉప్పెన” చిత్రంతో తెరంగ్రేటం చేసిన ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్ లో అపారమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ పోతినేని “రాపో19″లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆమె నానితో పాటు “శ్యామ్ సింగ రాయ్” చిత్రం కూడా చేస్తోంది. అంతేకాకుండా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు తదుపరి చిత్రంలో కూడా కనిపించనుంది. అయితే తాజాగా అక్కినేని హీరో ఆఫర్ ను కృతి శెట్టి తిరస్కరించింది అంటూ ప్రచారం జరుగుతోంది.

Read Also : అఫిషియల్ : “శాకుంతలం”తో అల్లు అర్హ ఎంట్రీ

ఆ వార్తల ప్రకారం నాగ్ రొమాంటిక్ చిత్రం “బంగార్రాజు”లో నాగ చైతన్య కీలకపాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. అందులో చైతన్య సరసన నటించడానికి కృతి నిరాకరించింది అంటున్నారు. “బంగార్రాజు” మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’కు ప్రీక్వెల్. ఈ చిత్రంలో నాగార్జున కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే బిజీ షెడ్యూల్ వల్ల కృతి ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించింది అని తెలుస్తోంది. మరోవైపు ఎస్.ఆర్. శేఖర్ దర్శకత్వంలో నితిన్ చేయబోయే నెక్ట్ మూవీలో కూడా ఆమె పేరు విన్పిస్తోంది.

Exit mobile version