నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. తాజాగా జరిగిన శ్యామ్ సింగ రాయ్’ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ‘ఉప్పెన’ సెన్సేషన్ కృతి శెట్టి ఈ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ “ఈ చిత్రం పనితీరు, ఎగ్జిక్యూషన్ చూడటానికి ట్రీట్ అవుతుంది. దయచేసి మాస్క్ ధరించి సురక్షితంగా వచ్చి థియేటర్లలో మాత్రమే సినిమా చూడండి. సినిమాలో కీర్తిగా నటిస్తున్నాను. నాకు, మా కుటుంబానికి నాని అంటే చాలా ఇష్టం. నా రెండో సినిమాలోనే ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం’ అని నటి పేర్కొంది.
Read Also : ఆన్లైన్ టిక్కెటింగ్ జీవో రద్దుపై బాలయ్య రియాక్షన్
“నిర్మాత వెంకట్ చాలా స్వీట్. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తన రెండో సినిమా చేస్తున్నాడు కానీ నాకు అలా అనిపించలేదు. ఆయన ఏం చేస్తున్నాడో, ఏమి కోరుకుంటున్నాడో చాలా స్పష్టంగా, నమ్మకంగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ “శ్యామ్ సింగ రాయ్” దే” అంటూ కృతి శెట్టి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చింది.
