Krishna Chaitanya Speech At Gangs Of Godavari Pre Release Event : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ కారణజన్ములు ఎప్పుడూ మన వెన్నంటే ఉండి నడిపిస్తారని పెద్దవారు చెబుతుంటారు. సరిగ్గా సంవత్సరం క్రితం మే 28న ‘జోహార్ ఎన్టీఆర్’ అనే ఫస్ట్ పోస్టర్ తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనకాల ఎన్టీఆర్ గారే ఉండి నడిపిస్తున్నారనిపిస్తుంది. ఏ కంటెంట్ రిలీజ్ చేసినా.. గ్లింప్స్ రిలీజ్ చేసినా, టీజర్ రిలీజ్ చేసినా, సాంగ్స్ రిలీజ్ చేసినా, ట్రైలర్ రిలీజ్ చేసినా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. మా గురువు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి మూలం, ఆద్యం.. ఆయన వల్లే మొదలైంది, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. యువన్ శంకర్ రాజా అద్భుతమైన సంగీతం అందించారు. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఎడిటర్ నవీన్ నూలి నాకు వెన్నెముకలా నిలబడి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.
Hyper Aadi: తెలుగు సినిమాను బ్రతికించండి…రివ్యూలపై హైపర్ ఆది కీలక వ్యాఖ్యలు!
మా డీఓపీ అనిత్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. విశ్వక్ సేన్ గురించి చెప్పాలంటే.. నా మాస్ కా దాస్.. నా బ్రదర్, మా బంధం మాటల్లో చెప్పలేనిది. ఒక్కటి మాత్రం చెప్పగలను. విశ్వక్ పోషించిన లంకల రత్న పాత్ర మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, భయపెడుతుంది. అలాగే, ఈ సినిమాలో రత్న జీవితంలో ఇద్దరు బలమైన అమ్మాయిలు ఉన్నారు. బుజ్జిగా నేహా శెట్టి, రత్నమాలగా అంజలి పాత్రలు గుర్తుండిపోతాయి. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా కృతఙ్ఞతలు. బాలకృష్ణ గారి గురించి మాట్లాడే అంత స్థాయి నాకు లేదు, ఆయన ఇక్కడికి రావడం మా అదృష్టం. బాలకృష్ణ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానన్నారు.