అనుష్క శెట్టి, అలియాస్ స్వీటీ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఫస్ట్ మూవీ తోనే తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది. దీం తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికి.. ‘అరుంధతి’ సినిమాతోనే తనకు మంచి గుర్తింపు లభించింది, ఇక ‘బాహుబలి’ మూవీ అనుష్క కెరీర్‌ని మార్చేసిందని చెప్పాలి. తనకు తిరుగులేని ఫ్యాన్ బేస్‌ని పెంచింది.
ప్రస్తుతం అనుష్క శెట్టి,దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబోలో ‘ఘాటి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లేడీ ఓరియెంటెండ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే, 85 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్రెడీ మొదలైందట.
ఇంకో అప్ డేట్ ఏంటి అంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ చిత్రం క్లైమాక్స్ ను షూట్ చేయనున్నారట. ఈ క్లైమాక్స్ షూట్ అనంతరం.. డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెడతారట. అనుష్క తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పనుంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రం థియేటర్‌లో రిలీజ్ అయిన తర్వాత అమెజాన్ లోకి రానుందట.కాగా ప్రస్తుతం అనుష్క ఈ సినిమాతో పాటు మలయాళంలో కూడా ఓ సినిమా చేస్తోంది. మొత్తానికి చాలా కాలం తర్వాత అనుష్క ని ‘షూటీ’ మూవీ లో పవర్ ఫుల్ ఉమెన్ గా చూడబోతున్నాం.